పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్..రాహుల్ గాంధీని ప్రశ్నించిన యువతి..ఆన్సర్ అదిరిపోయింది
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ 50 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే. అసలు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా లేదా బ్రహ్మచారిగానే మిగిలిపోతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. రాహుల్ గాంధీకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలోనే రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో విద్యార్థినులతో భేటీ అయిన రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. పెళ్లి గురించి మీ ఇంట్లో ఒత్తిడి చేయడం లేదా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనికి ఆయన నవ్వుతూ సదరు యువతులనే మీ పెళ్లి ఎప్పుడ అని అడిగారు. పెళ్లి అనేది జీవితంలో తప్పని ఘట్టం అని.. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏం లేవు అని రాహుల్ బదులిచ్చారు. అనంతరం మీ పెళ్లికి మమ్మల్ని కూడా పిలవాలని యువతులు రాహుల్‌ను అడగ్గా.. తప్పకుండా పిలుస్తానని హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ పెళ్లిపై ప్రత్యర్థులు కూడా ఆయనపై విమర్శలు చేస్తుంటారు. మరోవైపు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన సమయంలో పబ్‌లో అమ్మాయిలతో కనిపించిన ఫొటోలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, రాహుల్ గాంధీ ప్రేమించుకున్నారనే వార్తలు కూడా తెర మీదకు వచ్చాయి. ఓ ఇంటర్య్వూలో కరీనా మాట్లాడుతూ.. మీకు డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అని అంటే ఆలోచించకుండా ఠక్కున రాహుల్ గాంధీ పేరు చెప్పింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమలో పడి ఆయన్ని వివాహం చేసుకుంది.












Click it and Unblock the Notifications