రక్షణ విధానాలను వ్యతిరేకించినందుకే హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం: ఉర్జిత్
అమెరికా కొత్త హెచ్ 1 బీ వీసా పాలసీ నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పందించారు.
న్యూఢిల్లీ: అమెరికా కొత్త హెచ్ 1 బీ వీసా పాలసీ నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పందించారు. అమెరికా తదితర దేశాల రక్షణ విధాలను తాము తీవ్రంగా వ్యతిరేకించినందునే ట్రంప్ హెచ్ 1 బీ వీసాలపై కఠిన నిబంధనలను తెచ్చారన్నారు ఉర్జిత్.
కఠిన నిబంధనలతో తీసుకొచ్చిన కొత్త ఆర్డర్లపై చురకలంటించారు ఉర్జిత్ పటేల్. పరస్పర సహాకారం లేకపోతే అమెరికా దిగ్గజ కంపెనీలు ఎక్కడ ఉండేవని ఆయన ప్రశ్నించారు. కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ లో ఇండియన్ పాలసీలపై రాజ్ సెంటర్ స్పాన్సర్ చేసిన థర్డ్ కోటక్ ప్యామిలీ విశిష్ట ప్రసంగం చేశారాయన.

అమెరికా సహ ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కార్పోరేషన్ల విలువ గ్లోబల్ సప్లయ్ చైనా కారణంగానే పెరిగిందన్నారు. పెద్ద సంపద సృష్టికర్తలు ఇలాంటి విధానాలను అవలంభిస్తే చివరి వారే ఈ ప్రభావానికి లోనుకావాల్సి వస్తోందని ఆర్ బి ఐ గవర్నర్ చెప్పారు.
కస్టమ్ డ్యూటీలు, సరిహద్దు పన్ను వంటి వాణిజ్య పరికరాలను ఉపయోగించడం సమర్థవంతమైన మార్గం కాదన్నారు. వాస్తవానికి దీనికి వేరే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈక్విటీ, డిస్ట్రిబ్యూషన్ విధానాల్లో అనుసరిస్తున్న విధానాలను కొన్నింటి ప్రభావకం వారికి తెలియడం లేదన్నారు.
ఈ పరిణామాలు వృద్దికి నష్టమన్నారు. దేశీయ విధాన సమస్యగా ఉండాలన్నారు. దేశీయ ఆర్థిక విధానాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఉర్జిత్ చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications