Indigo: విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం..
విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా విమానంలో ఓ వ్యక్తి పిచ్చిగా ప్రవర్తించాడు. ఎమర్జేన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. గమనించిన తోటి ప్రయాణుకులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి చెన్నై బయల్దేరిన ఇండిగో విమానంలో జరిగింది. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నించాడు.
ఇండిగో ఎయిర్ లైన్స్ చెందిన విమానం 6E 6341 మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి చెన్నైకి బయల్దేరింది. విమానం చెన్నైకి చేరుకుంది. ఫ్లైట్ కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా.. ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే గుర్తించిన తోటి ప్రయాణికులు అతడిని వారించారు. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది నిందితుడిని అతికష్టమీద అడ్డుకున్నారు. విమానం చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే నిందితుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు అప్పగించారు.

నిందితుడిని మణికందన్‌గా గుర్తించారు. ఇండిగో అధికారులు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. చెన్నై విమానాశ్రయంలో దిగగానే ఎయిర్‌లైన్ అధికారులు సీఐఎస్‌ఎఫ్ అధికారులకు ఘటన గురించి వివరించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. "ఒక ప్రయాణీకుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించారని మా సిబ్బంది గుర్తించారు. మేము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ప్రయాణీకులను ఎస్కార్ట్ చేయడానికి CISF అధికారులను కేటాయించమని అభ్యర్థిస్తున్నాము " అని సిఐఎస్ఎఫ్ అధికారులకు బుధవారం ఇండిగో లేఖ రాసినట్లు తెలిసింది.
విమానంలో జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలను ఎయిర్‌లైన్స్ అధికారులు సీఐఎస్‌ఎఫ్‌కు వివరించారు. గతంలో కూడా విమానంలో ప్రయాణికులు వింత ప్రవర్తించిన సంఘటనలు జరిగాయి.












Click it and Unblock the Notifications