రతన్ టాటా వారసుడు అతడేనా ? సమర్ధ నాయకుడు, ట్రస్టీల్లో ఒకరు..!
వ్యాపార దిగ్గజం, గొప్ప మానవతావాదిగా కీర్తి సంపాదించుకున్న రతన్ టాటా మరణం భారత పారిశ్రామిక వర్గాల్లో విషాదం నింపింది. భారత పారిశ్రామిక రంగానికి రతన్ టాటా చేసిన సేవలు, టాటా సామ్రాజ్యాన్ని విలువలతో నిర్మించిన తీరు, ఆయన నిస్వార్ధ ఆలోచనలు ఇప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఆయన వారసుడిగా రాబోతున్నది ఎవరన్న చర్చ కూడా మొదలైంది.
రతన్ టాటా జీవిత చరిత్ర తెలుసుకోండి..!
రతన్ టాటా వారసుడెవరు ?
రెండు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షల కోసం చేరిన రతన్ టాటా రెండు రోజుల్లోనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు మారడం, అక్కడే తుది శ్వాస విడవడం జరిగిపోయాయి. దీంతో ఆయన స్ధానంలో అంత పెద్ద టాటా సామ్రాజ్యాన్ని నడిపించేదెవరన్న చర్చ మొదలైంది. దీంతో రతన్ టాటా సవతి సోదరుడు అయిన నోయల్ నావల్ టాటాకు ఆయన తర్వాత పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవరీ నోయల్ నావెల్ టాటా ?
నావల్ టాటా, సిమోన్ టాటాల కుమారుడైన నోయల్ నావెల్ టాటా.. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ కూడా అయిన రతన్ టాటాకూ, అతని సోదరుడు జిమ్మీ టాటాకు సవతి సోదరుడే. టాటా కుటుంబంలో కూడా ఆయన ఓ భాగం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రతన్ టాటా తండ్రి నావెల్ టాటాకు ఆయనతో పాటు జిమ్మీ టాటా మొదటి భార్య సూనీ కమిషరియట్ కుమారులు. నోయల్ నావెల్ టాటా రెండో భార్య కుమారుడు.
టాటా గ్రూపుతో నోయెల్ అనుబంధం
నావెల్ టాటా రెండో భార్య కుమారుడైన నోయల్ నావెల్ టాటా తమ టాటా గ్రూపులో 40 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. అంతే కాదు వివిధ టాటా గ్రూప్ కంపెనీల బోర్డులోనూ, టైటాన్ కంపెనీ లిమిటెడ్ లోనూ పనిచేస్తున్నారు. అలాగే సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో ట్రస్టీగా కూడా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీగా సంస్ధ టర్నోవర్ ను 500 మిలియన్ యూఎస్ డాలర్ల టర్నోవర్ నుండి 3 బిలియన్ డాలర్లకు చేర్చిన ఘనత కూడా ఉంది. అలాగే టాటా సంస్ధకు చెందిన పలు ట్రస్ట్ లలోనూ సభ్యుడిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications