వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delta Variant: ఇప్పటికే 100 దేశాల్లో-రాబోయే రోజుల్లో డామినెంట్‌గా మారే ఛాన్స్ :డబ్ల్యూహెచ్ఓ

|
Google Oneindia TeluguNews

భారత్‌లో సెకండ్ వేవ్ ఉధృతికి కారణమైన డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ 100 దేశాలకు డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) గుర్తించింది. ఒరిజినల్ వేరియంట్ కంటే ఇది రెండున్నర రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అదే సమయంలో భారత్,అమెరికా,యూకె,రష్యా,సౌతాఫ్రికా తదితర దేశాల్లో ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్లకు ఇది దారితీస్తోంది.

డేటా ఏం చెబుతోంది...

డేటా ఏం చెబుతోంది...

GISAID (Global initiative on sharing all influenza data) డేటా ప్రకారం... గత నాలుగు వారాల్లో భారత్‌లో 224 కేసుల్లో జీనోమ్ సీక్వెన్స్ చేపట్టగా ఇందులో 67 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వే అని తేలింది. ఇండియా టుడే డేటా ఇంటలిజెన్స్ యూనిట్(డీఐయూ) 78 దేశాల్లోని డెల్టా వేరియంట్ కేసుల డేటాను విశ్లేషించగా... ఇందులో భారత్,యూకె,రష్యా,సింగపూర్,ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా తదితర దేశాల్లో ప్రస్తుతం ఈ వైరస్ వృద్ది చెందుతున్నట్లు తేలింది. గత నాలుగు వారాల డేటా ప్రకారం... యూకె,సింగపూర్‌లో 90 శాతం జీనోమ్ సీక్వెన్స్ కేసుల్లో డెల్టా వేరియంట్ బయటపడటం గమనార్హం.

96 దేశాల్లో డెల్టా వేరియంట్...

96 దేశాల్లో డెల్టా వేరియంట్...

'జూన్ 29, 2021 నాటికి, 96 దేశాలు డెల్టా వేరియంట్ కేసులను రిపోర్ట్ చేశాయి. నిజానికి ఈ అంచనా తక్కువే అయినప్పటికీ... వేరియంట్లను గుర్తించడానికి అవసరమైన సీక్వెన్సింగ్ సామర్థ్యాలు పరిమితంగా ఉన్నాయి. డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది.' అని డబ్ల్యూహెచ్ఓ తమ తాజా నివేదికలో వెల్లడించింది. డెల్టా వేరియంట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదట భారత్‌లో గుర్తించిన సంగతి తెలిసిందే.

డామినెంట్‌గా మారే ఛాన్స్...

డామినెంట్‌గా మారే ఛాన్స్...

గతవారం బ్రెజిల్‌లో అత్యధికంగా 5,21,298,భారత్‌లో 3,51,218,కొలంబియాలో 2,04,132 కేసులు,రష్యాలో 1,34,465 కేసులు బయటపడ్డాయి. డెల్టా వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా... ఇతర వేరియంట్ల కంటే ఇది వేగంగా వృద్ది చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. రాబోయే నెలల్లో ఇతర అన్ని వేరియంట్ల కంటే ఇది డామినెంట్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియా,సౌతాఫ్రికాలు ప్రస్తుతం లాక్‌డౌన్ పాటిస్తున్నాయి.

గతేడాది అక్టోబర్‌లో బయటపడ్డ డెల్టా వేరియంట్ ఒరిజినల్

గతేడాది అక్టోబర్‌లో బయటపడ్డ డెల్టా వేరియంట్ ఒరిజినల్

గతేడాది అక్టోబర్‌లో మొదట B.1.617 వేరియంట్ బయటపడింది. దీని నుంచి మరో మూడో వేరియంట్స్‌ను గుర్తించారు. అందులో B.1.617.1, B.1.617.2,B.1.617.3 వేరియంట్స్ ఉన్నాయి. ఒరిజినల్‌తో పాటు మిగతా రెండు సబ్ వేరియంట్స్ కంటే B.1.617.2 అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని గతంలోనే డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. అంతర్జాతీయంగా దీన్ని ఆందోళనకారక వేరియంట్‌ (వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌)గా ప్రకటించింది. ఇటీవలే దీనికి డెల్టా వేరియంట్‌గా నామకరణం చేశారు. భారత్‌ విషయానికి వస్తే ప్రస్తుతం కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. అయితే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

English summary
The Delta variant that caused the second wave in India is still expanding rapidly around the world. The WHO (World Health Organization) has identified the Delta variant spread to 100 countries so far. It is spreading two and a half times faster than the original variant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X