Renu Bhatia Controversy: అమ్మాయిలు ఓయో రూమ్స్‌లో హారతి పట్టేందుకు వెళతారా..లేక..!

చండీగఢ్: అమ్మాయిలు ఓయో గదుల్లో హారతి పట్టేందుకు వెళుతున్నారని అనుకుంటున్నారా.. అబ్బే అస్సలు కాదు. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు... సాక్ష్యాత్తు ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్. అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇంతకీ మేడం ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది..?

హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేణు భాటియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కైతల్‌లోని ఓ కాలేజీలో లా అండ్ సైబర్ క్రైమ్‌ టాపిక్‌ పై మాట్లాడుతూ అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమానికి భాటియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సైబర్ క్రైమ్, చిత్రహింసలకు సంబంధించి అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.సహజీవనం చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.

renu

సహజీవనంపై సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించారు భాటియా.సహజీవనం ద్వారా మహిళలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో తమ పరిధి చాలా తక్కువగా ఉంటుందని ఇందుకు కారణం సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్ అని చెప్పారు.ఇప్పటి వరకు తన దృష్టికి వచ్చిన కేసుల్లో ఎక్కువగా సహజీవనంకు సంబంధించినవే అని చెప్పుకొచ్చారు.అలాంటి సమయంలో తాము పరిధి దాటి సమస్యను పరిష్కరించే దిశగా వెళ్లలేమని అన్నారు.

ఇలాంటి కేసుల్లో ఇరు కుటుంబాల జోక్యం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబాలకు చెడ్డపేరు వస్తుందని చెప్పారు.సహజీవనంతో నేరాలు కూడా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు.మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయంటే అందుకు ఒక్కింత కారణం వారే అని చెప్పారు. అసలు అమ్మాయిలు ఓయో రూమ్‌లకు ఎందుకు వెళతారు.. పూజ చేయడానికి వెళతారా అంటూ వ్యగ్యంగా కామెంట్ చేశారు. అలాంటి చోట్లకు వెళ్లేముందు అక్కడ ఎంతటి ప్రమాదం పొంచి ఉంటుందో గ్రహించాలని సూచించారు.


అయితే తమ వద్దకు వచ్చిన కేసుల్లో అబ్బాయి తనను మోసం చేసి కూల్‌డ్రింక్‌లో ఏదో మత్తు పదార్థాలు కలిపి తనను లైంగికంగా వేధించి ఆపై వీడియో తీశాడనే ఫిర్యాదులు అమ్మాయిలు ఇస్తున్నారని రేణు భాటియా చెప్పుకొచ్చారు.ఓయో రూమ్స్‌కు వెళ్లేముందు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరా అని ప్రశ్నించింది. స్నేహం పేరుతో కచ్చితంగా అక్కడ ఏదో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతాయని గ్రహించాలని పేర్కొన్నారు.

కాలేజీల్లో చేరుతానే అమ్మాయిలు అబ్బాయిలకు రెక్కలొచ్చినట్లు భావిస్తారని చెప్పారు. అమ్మాయిలు కాలేజీల్లో చేరగానే ఎలాంటి బట్టలైనా ధరించొచ్చనే భావన వారిలో కలుగుతుందని అదే సమయంలో అబ్బాయిలు కూడా బైక్ ఉంటుంది, గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంటుందనే ఆలోచనలో ఉంటారని రేణు భాటియా అన్నారు. అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఆలోచించే అమ్మాయిలు ఈ ఒక్క విషయంలో లొంగిపోతారంటూ కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+