హర్దిక్‌ను ఎందుకు కొట్టానంటే : తరుణ్ చెప్పిన కారణమిదే ?

గాంధీనగర్ : సురేంద్రనగర్ ప్రచారంలో కాంగ్రెస్ నేత హర్దిక్ పటేల్ చెంప చెళ్లుమనించింది ఎందుకో వివరించాడు తరుణ్ గజ్జర్. పాటిదార్ల హక్కుల కోసం హర్దిక్ ఉద్యమించిన సమయంలో తన కుటుంబం ఇబ్బందులు పడినట్టు గుర్తుచేశారు. అందుకే ఇవాళ్టి సభలో పటేల్ చెంపపై చేయిచేసుకున్నట్టు వివరించారు.

తరుణ్‌పై దాడి ...

తరుణ్‌పై దాడి ...

హర్దిక్ ప్రచారం చేస్తుండగా తరుణ్ చేయిచేసుకోవడంతో కలకలం నెలకొంది. దీంతో అక్కడున్న హర్ధిక్ అనుచరులు తరుణ్‌పై దాడి చేశారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హర్ధిక్‌పై ఎందుకు చేయిచేసుకున్నావని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. తన గోడును వెల్లబోసుకున్నారు.

తెరువని మెడికల్ షాపులు ..

తెరువని మెడికల్ షాపులు ..

పాటిదార్ ఉద్యమానికి నాయకత్వం వహించిన హర్ధిక్ నిరసనలతో హోరెత్తించాడని గుర్తుచేశారు. ఓ సారి అహ్మదాబాద్‌లో ర్యాలీ చేసే సమయంలో కుమారుడికి మందులు తీసుకరావడానికి మెడికల్ షాపు కోసం వెళితే మూసి ఉందని .. ఒక్కటే కాదు అన్ని క్లోజ్ చేశారని తెలిపారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు హర్ధిక్ రోడ్లపై బంద్ చేపట్టేవాడు. గుజరాత్ మొత్తం బంద్‌లతో హోరెత్తింది. హర్ధిక్ ఎవరు, గుజరాత్ హిట్లరా అని ప్రశ్నించారు.

 14 మంది బలిదానం

14 మంది బలిదానం

అంతేకాదు 2015 ఆగస్టు 25న పాటిదార్ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో జరిగిన గొడవలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం హర్ధిక్‌పై దాడి చేసే సమయంలోనూ మనం 14 మంది పటీదార్లను కోల్పోయామని తరుణ్ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+