వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బి వీసాల్లో తప్పులు: ఆందోళనలో ఇండియన్ టెక్కీలు.. ఎందుకిలా?

అమెరికా వీసా ప్రింటింగ్ ప్రెస్ లో జరిగిన పొరపాటు కారణంగానే హెచ్1బికి బదులు 1బి1 అని ప్రింట్ అయినట్లు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అధ్యక్ష పదవిని అలంకరించిన నాటి నుంచి ట్రంప్ విదేశీ వలసలకు బ్రేక్ వేసేందుకు ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను కఠినతరం చేయడం, ప్రీమియం వీసాలను రద్దు చేయడం, ట్రావెల్ బ్యాన్ వంటి నిర్ణయాలు అమలులోకి వచ్చాయి.

ఈ పరిణామాలతో వీసా పొందేందుకు అష్టకష్టాలు పడుతున్న విదేశీయులకు ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చి పడింది. ముఖ్యంగా భారత టెక్కీలను ఈ అంశం కలవరపెడుతోంది. వీసా జారీ చేసే క్రమంలో ప్రింటింగ్ లో వెలుగుచూస్తున్న తప్పులు వారిని భయపెడుతున్నాయి. తాజాగా చాలామంది వీసా హోల్డర్స్ పిటిషన్స్ లో హెచ్1బికి బదులు 1బి1 అని రావడమే ఈ కలవరపాటుకు కారణం.

Why a printing error is causing anxiety amongst H1B visa holders

అమెరికా వీసా ప్రింటింగ్ ప్రెస్ లో జరిగిన పొరపాటు కారణంగానే హెచ్1బికి బదులు 1బి1 అని ప్రింట్ అయినట్లు చెబుతున్నారు. ప్రీమియం ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ పాస్ పోర్ట్ హోల్డర్స్ ఈ పొరపాటును గుర్తించారు. విషయాన్ని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరి వారిని అసంతృప్తికి గురిచేసింది. 1బి1 వీసా వల్ల అమెరికా వెలుపల ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ తప్పుడు స్టాంపింగ్ తో స్వదేశానికి ప్రయాణించడం వీలుపడదని వాపోతున్నారు. ప్రస్తుతం 1లక్షా 20వేల మంది హెచ్1బి వీసా హోల్డర్స్ అమెరికాలో ఉండగా.. వారిలో టెక్కీలే ఎక్కువ శాతంగా ఉన్నారు. తాజా పరిణామాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

English summary
Even as the cap for this year’s quota of 65,000 H1B visas was reached in a matter of four days starting April 3, a printing error on visas issued or renewed this year is causing anxiousness in the Indian tech industry workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X