Wife: భార్య మీద మేస్త్రీ మొగుడికి అనుమానం, బయట భార్య ?, అర్దరాత్రి ఏం చేశాడంటే, చంపేసి దర్జాగా జంప్ !
ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. అత్తమామలతో నిత్యం గొడవపడుతున్న భార్య వేరుగా ఇల్లు చేద్దామని భర్తకు చెప్పింది. భార్య కోరిక మేరకు భర్త వేరుకాపురం పెట్టారు. మేస్త్రీ పని చేస్తున్న భర్త ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి మళ్లీ ఇంటికి చేరుకుంటున్నారు. ఇంట్లో పగలు ఖాళీగా ఉంటున్న భార్య స్మార్ట్ మొబైల్ ఫోన్ లో కాలం గడపడం, బయట తిరగడం చేస్తోంది. రానురాను భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. మేస్త్రీ పని చేస్తున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. మద్యం మత్తు ఇంటికి వెలుతున్న భర్త అతని భార్య మీద అనుమానంతో చితకబాదుతున్నాడు. రాత్రి భార్యతో గొడవపడిన భర్త అతని భార్యను చంపేసి దర్జాగా చెక్కేశాడు.

మేస్త్రీ పని చేస్తున్న భర్త
ముంబాయిలో సుఖ్ చంద్ షేక్ అలియాస్ ముక్తార్ షేక్ (33) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మంజీలా షేక్ అలియాస్ మంజీలా (31) అనే యువతిని ముక్తార్ షేక్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మంజీలా షేక్, ముక్తార్ షేక్ దంపతులు మూడు సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. ముక్తార్ షేక్ మేస్త్రీగా పని చేస్తున్నాడు.

వేరు కాపురం పెట్టించిన భార్య
అత్తమామలతో నిత్యం గొడవపడుతున్న మంజీలా షేక్ మనం వేరుగా ఇల్లు చేద్దామని ఆమె భర్త ముక్తార్ షేక్ కు చెప్పింది. ముంబాయిలోని జేజే మార్గ్ లోని ఇమామ్ వాడా ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకున్న ముక్తార్ షేక్ అతని భార్య మంజీలా షేక్ తో కలిసి కాపురం చేస్తున్నాడు. మేస్త్రీ పని చేస్తున్న ముక్తార్ షేక్ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి మళ్లీ ఇంటికి చేరుకుంటున్నాడు.

బయట తిరుగుతున్న భార్య మీద అనుమానం ?
ఇంట్లో పగలు ఖాళీగా ఉంటున్న మంజీలా షేక్ స్మార్ట్ మొబైల్ ఫోన్ లో కాలం గడపడం మొదలుపెట్టింది. రానురాను మంజీలా షేక్ బయట తిరగడం చేస్తోంది. నీ భార్య మంజీలా షేక్ ఎక్కువగా బయట తిరుగుతోందని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు ముక్తార్ షేక్ కు చెప్పారు. కొంతకాలం క్రితం నుంచి భార్య మంజీలా షేక్ మీద ఆమె భర్త ముక్తార్ షేక్ కు అనుమానం మొదలైయ్యింది.

వీరతాగుబోతు అయిన భర్త
మేస్త్రీ పని చేస్తున్న ముక్తార్ షేక్ కు భార్య మీద అనుమానం మొదలు అయిన తరువాత విపరీతంగా మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. మద్యం మత్తు ఇంటికి వెలుతున్న ముక్తార్ షేక్ అతని భార్య మీద అనుమానంతో ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. స్థానికులు సర్దిచెప్పినా ముక్తార్ షేక్ మాత్రం ఎవ్వరిమాట వినలేదని తెలిసింది.

భార్యను చంపేసి దర్జాగా ఎస్కేప్
రాత్రి ఇంటికి వెళ్లిన ముక్తార్ షేక్ అతని భార్య మంజీలా షేక్ తో గొడవపడ్డాడు. ఎందుకు నువ్వు ఎక్కువగా బయట తిరుగుతున్నావు అంటూ మంజీలా షేక్ ను నిలదీశాడు. తరువాత సహనం కోల్పోయిన ముక్తార్ షేక్ తాడు తీసుకుని అతని భార్య మంజీలా షేక్ గొంతు బిగించి చంపేసి దర్జాగా చెక్కేశాడు.

స్థానికులు ఏం చెప్పారంటే ?
ఉదయం మంజీలా షేక్ హత్యకు గురైన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి ముక్తార్ షేక్, మంజీలా షేక్ గొడవపడ్డారని స్థానికులు సమాచారం ఇచ్చారని, స్థానికులు ఎంత సర్దిచెప్పినా ముక్తార్ షేక్ రెచ్చిపోయాడని తెలిసిందని పోలీసులు అన్నారు. ముక్తార్ షేక్ కోసం గాలిస్తున్నామని ముంబాయి పోలీసులు తెలిపారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications