Wife: బెడ్ రూమ్ లో భార్యను రివాల్వర్ తో కాల్చి చంపేసి అదే రివాల్వర్ తో కాల్చుకున్న భర్త, షాక్ లో కొడుకు !
రాజ్ కోట్/ అహమ్మదాబాద్: సీఆర్ పీఎఫ్ లో మంచి ఉద్యోగం చేస్తున్న సమయంలో వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. సీఆర్ పీఎఫ్ జవానుగా రిటైడ్ అయిన వ్యక్తి ఆయన భార్యతో కలిసి సంతోషంగా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో నివాసం ఉంటూ కాపురం చేస్తున్నాడు. ప్రతిరోజు బయటకు వెలుతున్న ఆయన అతని స్నేహితులతో, బంధువులతో మాట్లాడి వస్తున్నాడు. సీఆర్ పీఎఫ్ మాజీ ఉద్యోగి భార్య మాత్రం ఇంట్లోనే ఉంటున్నది. కొడుకు బయకు వెళ్లిన తరువాత అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో దంపతులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భర్త అతని రివాల్వర్ తీసుకుని బెడ్ రూమ్ లో భార్యను కాల్చి చంపేశాడు. భార్యను చంపేసిన ఆవేశంలోనే అతను కూడా అదే రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

సీఆర్ పీఎఫ్ లో మంచి ఉద్యోగం
హర్యానాలోని రోతహ్ లో మహేందర్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. సీఆర్ పీఎఫ్ లో మంచి ఉద్యోగం చేస్తున్న సమయంలో సుదేష్ అనే మహిళను వివాహం చేసుకున్న మహేందర్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశారు. మహేందర్, సుదేష్ దంపతులకు అమిత్ కొడుకు కూడా ఉన్నాడు.

హ్యాపీగా ఉంటున్న ఫ్యామిలీ
రోతహ్ లోని జింద్ రోడ్డులోని భగవతిపూర్ లో మహేందర్, సుదేష్ దంపతులు వారి కొడుకు అమిత్ తో కలిసి నివాసం ఉంటూ చాలా సంతోషంగా ఉంటున్నారు. మహేందర్, సుదేష్ దంపతుల కొడుకు అమిత్ ఉద్యోగం చేస్తున్నాడు. సీఆర్ పీఎఫ్ జవానుగా రిటైడ్ అయిన మహేందర్ ఆయన భార్య సుదేష్ తో కలిసి సంతోషంగా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో నివాసం ఉంటూ కాపురం చేస్తున్నాడు.

అపార్ట్ మెంట్ లో గొడవపడిన దంపతులు
ప్రతిరోజు బయటకు వెలుతున్న మహేందర్ అతని స్నేహితులతో, బంధువులతో మాట్లాడి వస్తున్నాడు. సీఆర్ పీఎఫ్ మాజీ ఉద్యోగి మహేందర్ భార్య సుదేష్ మాత్రం ఇంట్లోనే ఉంటున్నది. కొడుకు అమిత్ బయకు వెళ్లిన తరువాత అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో మహేందర్, సుదేష్ దంపతులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో మహేందర్, సుదేష్ దంపతుల మద్య గొడవ జరిగింది.

రివాల్వర్ తో భార్యను కాల్చి చంపేసిన భర్త
ఆ సందర్బంలో సహనం కోల్పోయిన మహేందర్ రివాల్వర్ తీసుకుని ఆవేశంలో బెడ్ రూమ్ లో ఉన్న అతని భార్య సుదేష్ కాల్చి చంపేశాడు. భార్య సుదేష్ ను చంపేసిన ఆవేశంలోనే మహేందర్ కూడా అదే రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇంటికి వెళ్లిన అమిత్ తల్లిదండ్రులు మహేందర్, సుదేష్ శవమై కనిపించడంతో హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆరోగ్యం సక్రమంగా లేదని ?
కొంతకాలం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి మహేందర్ తన తల్లి సుదేష్ ను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని వారి కుమారుడు అమిత్ చెప్పాడని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే మహేందర్ అతని భార్య సుదేష్ ను హత్య చేసి ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. సీఆర్ పీఎఫ్ మాజీ ఉద్యోగి మహేందర్ అతని సొంత రివాల్వర్ తోనే అతని భార్య సుదేష్ ను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications