Wife: భార్య లేడీ పోలీసు, భర్త సైనికుడు, మద్యలో చాలా గ్యాప్ వచ్చిందని ?, భార్యను సింపుల్ గా చంపేసి !
బరేలి/లక్నో: యువకుడు సైనికుడిగా ఉద్యోగంలో చేస్తున్నాడు. యువతి పోలీస్ స్టేషన్ లో లేడీ పోలీసుగా ఉద్యోగంలో చేరింది. ఇద్దరూ హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. లేడీ పోలీసుకు, సైనికుడికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. లేడీ పోలీసు, సైనికుడు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. పెళ్లి జరిగిన కొన్ని నెలల తరువాత సైనికుడు ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిపోయాడు. లేడీ పోలీసు ఆమె భర్తకు ఫోన్ చేసి మాట్లాడుతోంది. తరువాత చాలా తతంగం జరిగింది. సెలవుల మీద ఇంటికి వచ్చిన సైనికుడు అతని భార్యను పక్కాప్లాన్ తో చంపేసి ఎస్కేప్ అయ్యాడు.

ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు
ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో ఆకాష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆకాష్ సైనికుడిగా ఉద్యోగంలో చేరాడు. జాట్ రెజిమెంట్ లో ఆకాష్ విధులు నిర్వహిస్తున్నాడు. బరేలి సమీపంలో నివాసం ఉంటున్న శిఖా అనే యువతి బరేరిలోని కాంట్ పోలీస్ స్టేషన్ లో లేడీ పోలీసుగా ఉద్యోగంలో చేరింది.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు
ఆకాష్, శిఖా ఎవరిపాటికి వాళ్లు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. లేడీ పోలీసు శిఖాకు, సైనికుడు ఆకాష్ లు ఇద్దరూ ఒకే కులం కావడంతో వారికి పెళ్లి చెయ్యాలని ఇరు వైపుల పెద్దలు మాట్లాడుకున్నారు. లేడీ పోలీసు శిఖా, సైనికుడు ఆకాష్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేడీ పోలీసు శిఖా, సైనికుడు ఆకాష్ సంతోషంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు.

సెలవుల్లో ఇంటికి వచ్చి వెలుతున్న భర్త
లేడీ పోలీసు శిఖాను పెళ్లి చేసుకున్న కొన్ని నెలల తరువాత సైనికుడు ఆకాష్ ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిపోయాడు. తరువాత సెలవుల్లో ఇంటికి వెళ్లి అతని భార్య శిఖాతో సంతోషంగా ఉంటున్నాడు. బరేలిలోని కాంట్ పోలీస్ స్టేషన్ లోనే శిఖా లేడీ పోలీసుగా ఉద్యోగం చేస్తోంది. శిఖా ఆమె భర్త ఆకాష్ కు ఫోన్ చేసి మాట్లాడుతోంది.

భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు
లేడీ పోలీసు శిఖా మీద ఆమె భర్త ఆకాష్ కు అనుమానం మొదలైయ్యింది. సాటి పోలీసుతో తన భార్య శిఖా తిరుగుతోందని ఆకాష్ కు తెలిసింది. తరువాత దంపతుల మద్య గొడవలు జరిగాయని తెలిసింది. ఇదే విషయంలో శిఖా, ఆకాష్ ల మద్య రాద్దాంతం జరిగిందని సమాచారం. తన భార్య శిఖాను చంపేయాలని సైనికుడు ఆకాష్ డిసైడ్ అయ్యాడు.

విషప్రయోగంతో భార్యను చంపేసి ఎస్కేప్
మూడు నెలల క్రితం ఆకాష్ అతని ఇంటికి వెళ్లాడు. తరువాత లేడీ పోలీసు భార్య శిఖాతో ఆకాష్ గొడవలు పడుతూనే ఉన్నాడు. సెప్టెంబర్ 15వ తేదీన శిఖా ఇంటిలో శవమై కనిపించింది. లేడీ పోలీసు శిఖా చనిపోయిన తరువాత ఆమె భర్త ఆకాష్ మాయం అయ్యాడు. 75 రోజుల నుంచి ఆకాష్ కోసం బరేలి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.

అనుమానంతోనే లేడీ పోలీసు హత్య
చివరికి గురువారం బరేలి పోలీసులు జాట్ రెజిమెంట్ చేరుకుని అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చి ఆకాష్ ను అరెస్టు చేశారు. లేడీ పోలీసు శిఖాను విషం పెట్టి ఆమె భర్త ఆకాష్ హత్య చేశాడని బరేలి పోలీసులు అంటున్నారు. సెలవుల మీద ఇంటికి వెళ్లిన సైనికుడు ఆకాష్ అతని భార్య శిఖా మీద అనుమానంతో పక్కాప్లాన్ తో చంపేసి ఎస్కేప్ కావడం బరేలిలో హాట్ టాపిక్ అయ్యింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications