Wife: ఫేమస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, మూడో పెళ్లికి ప్లాన్, రూ. 10 లక్షలు ఇచ్చి భర్తను చంపించిన రెండో భార్య !
బెంగళూరు/బెళగావి: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి డబ్బులు బాగా సంపాదిస్తూ వివాహం చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అతను ఇద్దరు స్నేహితులతో కలిసి అపార్ట్ మెంట్ లు నిర్మాణ రంగంలో, అనేక ప్రాజెక్టులు నిర్మిస్తూ పెద్ద బిల్డర్ గా ఎదిగాడు. స్నేహితులతో కలిసి అనేక ప్రాజెక్టులు చేస్తున్న వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు తెలీకుండా రెండో భార్యతో, రెండో భార్యకు తెలీకుండా మొదటి భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో మూడో పెళ్లి చేసుకోవడానికి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి సిద్దం అయ్యాడు. రానురాను రియల్ ఎస్టేట్ వ్యాపారికి, అతని పార్ట్నర్స్ మద్య తేడాలు వచ్చాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారిని నమ్ముకుని నిర్మాణ రంగంలో దిగి సంవత్సరాలు పూర్తి అయినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని అతని స్నేహితులు రగిలిపోయారు. నేను ఉండగానే మూడో పెళ్లి చేసుకుంటున్నాడని, తన పేరుతో, తన పిల్లల పేరుతో అస్తులు రాసివ్వకుండా ఇప్పుడు మూడో భార్య పెళ్లి చేసుకోవాలని మోజు పడుతున్న భర్తను చంపేయాలని అతని రెండో భార్య డిసైడ్ అయ్యింది. రెండో భార్య, ఇద్దరు వ్యాపార భాగస్వాములు కలిసి రూ. 10 లక్షలు కిరాయి ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేయించడం కలకలం రేపింది. జయ కర్ణాటక జిల్లా అధ్యక్షుడి స్కెచ్ తో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురికావడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రముఖ బిల్డర్
కర్ణాటకలోని బెళగావి నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దోడ్డబోమ్మన్నవర్ అలియాస్ రాజు నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రాజు డబ్బులు బాగా సంపాదిస్తూ వివాహం చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రాజు ఇద్దరు స్నేహితులు ధర్మేంద్ర, శశికాంత్ తో కలిసి అపార్ట్ మెంట్ లు నిర్మాణ రంగంలో, అనేక ప్రాజెక్టులు నిర్మిస్తూ పెద్ద బిల్డర్ గా ఎదిగాడు.

రెండో పెళ్లి చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి
స్నేహితులతో కలిసి అనేక ప్రాజెక్టులు చేస్తున్న రాజు 10 సంవత్సరాల క్రితం కిరణ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలీకుండా రెండో భార్య కిరణతో, రెండో భార్య కిరణకు తెలీకుండా మొదటి భార్యతో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో మూడో పెళ్లి చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు సిద్దం అయ్యాడు.

ఫ్రెండ్స్ మద్య తేడాలు వచ్చేశాయి
రానురాను రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజుకు, అతని పార్ట్నర్స్ శశికాంత్, ధర్మేంద్రల మద్య వ్యాపారలావాదేవీల మద్య తేడాలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజును నమ్ముకుని నిర్మాణ రంగంలో దిగి 10 సంవత్సరాలు పూర్తి అయినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని అతని స్నేహితులు ధర్మేంద్ర, శశికాంత్ రగిలిపోయారు.

భర్తను చంపేయాలని రెండో భార్య స్కెచ్
నేను ఉండగానే తన భర్త రాజు మూడో పెళ్లి చేసుకుంటున్నాడని, తన పేరుతో, తన పిల్లల పేరుతో అస్తులు రాసివ్వకుండా ఇప్పుడు మూడో మహిళను పెళ్లి చేసుకోవాలని మోజు పడుతున్న భర్త రాజును చంపేయాలని అతని రెండో భార్య కిరణ డిసైడ్ అయ్యింది. ఇదే విషయం భర్త రాజుతో తేడాలు వచ్చిన ధర్మేంద్ర, శశికాంత్ తో కిరణ చర్చించింది.

రూ. 10 లక్షలు కిరాయి ఇచ్చి చంపించింది
రెండో భార్య కిరణ, ఇద్దరు వ్యాపార భాగస్వాములు శశికాంత్, ధర్మేంద్ర కలిసి రూ. 10 లక్షలు కిరాయి ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజును హత్య చేయించాలని ప్లాన్ వేశారు. బెళగావి జిల్లా జయ కర్ణాటక జిల్లా అధ్యక్షుడు సంజయ్ రాజవూత్ కు రూ. 10 లక్షలు కిరాయి ఇచ్చి అతని స్కెచ్ ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ రాజును దారుణంగా హత్య చేయించారు.
Recommended Video


కిలాడీ పెళ్లామ్ అండ్ కో అరెస్టు
కేసు నమోదు చేసిన పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు హత్య కేసు చేదించారు. కట్టుకున్న భర్త రాజును అతని రెండో భార్య కిరణ హత్య చేయించదని వెలుగు చూడటం బెళగావిలో హాట్ టాపిక్ అయ్యింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు హత్య కేసులో అతని రెండో భార్య కిరణ, వ్యాపార భాగస్వాములు శశికాంత్, ధర్మేంద్రలను అరెస్టు చేశామని బెళగావి నగర పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications