Viral Video: ఆఫీస్ పనిపై ఊరెళ్లిన భర్త.. సిక్రెట్‍గా ఫాలో చేసిన భార్య.. కట్ చేస్తే పెళ్లిమండపానికి చేరిన సీన్

ఓ భర్త ఆఫీస్ పనిపై ఊరు వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. మూడు రోజుల తర్వాత వస్తానని జాగ్రత్తగా ఉండు అని చెప్పి లాగేజీ తీసుకుని బయటకు వెళ్లాడు. ఈ విషయమై భార్య భర్త ఆఫీస్ లో వాకాబు చేసింది. తన భర్త మూడు రోజులు లీవ్ పెట్టినట్లు తెలుసుకుంది. వెంటనే కుమారుడితో కలిసి భర్తను ఫాలో అయింది. అతను కారులో వెళ్తూ ఓ కళ్యాణ మండపం వద్ద ఆగాడు.

అప్పుడు భార్య తనకు తెలియకుండా పెళ్లికి వెళ్లాల్సిన అవసరం ఏముందని పెళ్లి మండపానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు ఓ ఫ్లెక్సీ కనిపించింది. అందులో పెళ్లి కుమారుడి ఫొటో స్థానంలో ఆమె భర్త ఫొటో ఉంది. ఆమె వెంటనే పెళ్లి కొడుకు ఎవరని అక్కడున్నవారిని ఆడిగింది. వారు ఫొటోలో ఉన్న వారే పెళ్లి కుమారుడని చెప్పేశారు. షాక్ గురైన భార్య.. వెంటనే తేరుకుని అక్కడున్న వారికి పెళ్లి కొడుకు తన భర్త అని చెప్పింది.

Wife catches his husband while marrying for third time

కానీ అక్కడున్న వారు నమ్మలేదు. ఈ బాబు తమ కుమారుడని వారికి చూపించింది. ఆ తర్వాత ఫోన్లో తమ పెళ్లి ఫొటోలు కూడా చూపించింది. అక్టోబరు 10న, 2014 తాము వివాహం చేసుకున్నట్లు చెప్పింది. దీంతో పెళ్లి పెద్దలకు కాస్త నమ్మకం ఏర్పడింది. ఆమెను వధువు కుటుంబ సభ్యులు గదిలోకి తీసుకెళ్లి అన్ని వివరాలు తెలుసుకున్నారు. పెళ్లి కొడుకు రెండో భార్య కూడా ఉందని తెలిసింది.

షాకైన వధువు కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకుని చితబాది పెళ్లిమండపం నుంచి బయటకు తరిమేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగినట్లు వార్తలు వస్తున్నా.. ఎక్కడ జరిగిందో కచ్చితమైన సమాచారం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+