Wife: ఆటోలో వెలుతున్న భార్య, నడిరోడ్డు నిలిపేసి కొట్టి చంపేసిన భర్త, ఏడాది నుంచి అదే సిటీలో !

ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో చక్కగా కాపురం చేశారు. భార్యకు ఏం కావాలంటే అది తీసిస్తున్న భర్త ఆమెను వారంలో ఒకసారి బయటకు పిలుచుకుని వెళ్లాడు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య తీరుపై భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో ఇంట్లో గొడవలు ఎక్కువ అయ్యాయి. దంపతుల మద్య పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండాపోయింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన దంపతులు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని భర్త పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తన భార్యకు బుద్ది చెప్పాలని అనుకున్నాడు. నడిరోడ్డులో భార్యను అడ్డుకున్న భర్త ఆమె మీద దాడి చెయ్యడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 మూడు సంవత్సరాల క్రితం !

మూడు సంవత్సరాల క్రితం !

ముంబాయిలో రాకేష్ రాయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం పెద్దలు చూపించిన ఆకాంక్ష కరత్మోల్ (21) అనే యువతిని రాకేష్ వివాహం చేసుకున్నాడు. పెద్లు కుదుర్చిన వివాహం చేసుకున్న రాకేష్, ఆకాంక్ష జీవితాంతం సంతోషంగా ఉంటారని బంధువులు అందరూ అనుకున్నారు.

 బాగానే ఉన్నారు.... కానీ ?

బాగానే ఉన్నారు.... కానీ ?

వివాహం చేసుకున్న రాకేష్, ఆకాంక్ష దంపతులు మొదట్లో చక్కగా కాపురం చేశారు. భార్య ఆకాంక్షకు ఏం కావాలంటే అది తీసిస్తున్న ఆమె భర్త రాకేష్ ఆమెను వారంలో ఒకసారి బయటకు పిలుచుకుని వెళ్లాడు. కరోనా వైరస్ దెబ్బతో రాకేష్ అతని భార్య ఆకాంక్షను బయటకు తీసుకెళ్లడం మానేశాడు. తరువాత రానురాను ఆకాంక్ష, రాకేష్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

విడిపోయిన దంపతులు

విడిపోయిన దంపతులు

తరువాత కొంతకాలానికి భార్య ఆకాంక్ష తీరుపై ఆమె భర్త రాకేష్ కు అనుమానం మొదలైయ్యింది. భార్య ఆకాంక్ష తీరుతో విసిగిపోయిన రాకేష్ ఆమెతో నిత్యం ఇదే విషయంలో ఇంట్లో గొడవలు పెట్టుకున్నాడు. రాకేష్, ఆకాంక్ష దంపతుల మద్య పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండాపోయింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన రాకేష్, ఆకాంక్ష గత ఏడాది నుంచి ముంబాయిలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు.

 నడిరోడ్డులో భార్యను కొట్టి చంపేసిన భర్త

నడిరోడ్డులో భార్యను కొట్టి చంపేసిన భర్త

భార్య ఆకాంక్ష తనను వదిలేసి వెళ్లిపోయిందని రాకేష్ పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తన భార్య ఆకాంక్షకు బుద్ది చెప్పాలని రాకేష్ అనుకున్నాడు. పని మీద బయటకు వెళ్లిన ఆకాంక్ష ఆటోలో ఇంటికి బయలుదేరింది. ఆర్ సీఎఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకాంక్ష వెలుతున్న ఆటోను రాకేష్ అడ్డుకుని ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.

 భార్య మీద కసి తీర్చుకున్న భర్త

భార్య మీద కసి తీర్చుకున్న భర్త

తరువాత మాటమాట పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన రాకేష్ అతని భార్య ఆకాంక్ష మీద నడిరోడ్డులో దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆకాంక్షను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆకాంక్ష ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు అన్నారు. .భార్య ఆకాంక్షను హత్య చేసిన ఆమె భర్తను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. భార్య ఆంకాక్ష మీద ఆమె భర్తకు రాకేష్ కు అనుమానం ఎక్కువ అయ్యిందని, పదేపదే ఆ విషయంలో గొడవల కారణంగా విడిపోయారని, చివరికి అదే విషయంలో భార్య హత్యకు గురైయ్యిందని పోలీసు అధికారులు అంటున్నారు. ఆకాంక్షను దారుణంగా కొట్టి చంపేసిన రాకేష్ ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+