Wife: భర్తకు బిల్డప్ ఎక్కువ. భార్యకు టెక్కు ఎక్కువ, పుట్టింటిలో సెటిల్ అయిన భార్య, ఒంటరిగా ఉండలేక !
బెంగళూరు: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న యువతి, యువకుడు సంతోషంగా కాపురం చేశారు. అయితే వివాహం జరిగిన రెండు సంవత్సరాలకే దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో పెద్దలు రాజీ చేసి దంపతులను ఒక్కటి చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశారు. భర్తకు కోపం ఎక్కువ, భార్యకు బెట్టు ఎక్కువ కావడంతో దంపతులు రాజీ అయ్యి సంతోషంగా కాపురం చెయ్యలేకపోయారు. గొడవలు జరుగుతున్నా దంపతులు ఒకే ఇంట్లో కొంతకాలం ఉన్నారు. అయితే భర్తతో గొడవ పడిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య తిరిగి ఇంటికి వస్తుందని, నేనే వెళ్లి అడిగితే ఇంకా ఎక్కువ బెట్టు చేస్తుందని భర్త అనుకున్నాడు. భార్య ఇంటికి వస్తుందిలే అంటూ భర్త కొంతకాలం నిర్లక్షంగా వ్యవహరించాడు. అయితే భార్య మాత్రం భర్త వైపు కన్నెత్తికూడా చూడలేదు, అతనికి ఫోన్ చెయ్యలేదు. తన భార్య రాదని తెలుసుకున్న భర్త ఆమె ఇంటికి వెళ్లి మన ఇంటికి రావాలని ఆమెకు చెప్పాడు. పోరారే, నీతో రాను, నీతో కాపురం చెయ్యను అని భార్య తేల్చి చెప్పింది. భార్యను తన ఇంటికి పిలుచుకుని వెళ్లాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భార్య ఇంటికి రాకపోవడంతో విసిగిపోయిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

బెంగళూరులో కాపురం
ఐటీ హబ్ బెంగళూరులోని ఇట్టుమడులోని మారుతి నగర్ లో నవీన్ కుమార్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన చైత్రా అనే యువతిని నవీన్ కుమార్ ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొత్తలో నవీన్ కుమార్, చైత్రా వాళ్ల బంధువుల ఇళ్లకు తిరుగుతూ సంతోషంగా కాపురం చేశారు.

భార్య భర్తలు ఢిష్యూం..... ఢిష్యూం
వివాహం జరిగిన రెండు సంవత్సరాలకే నవీన్ కుమార్, చైత్రా దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో పెద్దలు రాజీ చేసి నవీన్ కుమార్, చైత్రా దంపతులను ఒక్కటి చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశారు. భర్త నవీన్ కుమార్ కు కోపం ఎక్కువ, అతని భార్య చైత్రాకు బెట్టు ఎక్కువ కావడంతో దంపతులు రాజీ అయ్యి సంతోషంగా కాపురం చెయ్యలేకపోయారు. గొడవలు జరుగుతున్నా నవీన్ కుమార్, చైత్రా దంపతులు ఒకే ఇంట్లో కొంతకాలం కలిసి ఉన్నారు.

పుట్టింటికి చెక్కేసిన భార్య
భర్త నవీన్ కుమార్ తో గొడవ పడిన చైత్రా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య చైత్రా తిరిగి ఇంటికి వస్తుందని, నేనే వెళ్లి అడిగితే ఇంకా ఎక్కువ బెట్టు చేస్తుందని నవీన్ కుమార్ అనుకున్నాడు. భార్య చైత్రా తన ఇంటికి వస్తుందిలే అంటూ ఆమె భర్త నవీన్ కుమార్ చాలా కాలం నిర్లక్షంగా వ్యవహరించాడు.

భార్య కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన భర్త
ఇంత జరిగినా చైత్రా మాత్రం ఆమె భర్త నవీన్ కుమార్ వైపు కన్నెత్తికూడా చూడలేదు, అతనికి ఫోన్ చెయ్యలేదని సమాచారం. తన భార్య చైత్రా ఇంటికి తిరిగిరాదని తెలుసుకున్న నవీన్ కుమార్ కొంచెం వెనక్కి తగ్గి ఆమె ఇంటికి వెళ్లాడు. మన ఇంటికి రావాలని, ఇక ముందు కలిసి సంతోషంగా కాపురం చేద్దామని నవీన్ కుమార్ అతని భార్య చైత్రాకు చెప్పి ఆమె కాళ్లు పట్టుకున్నాడు.

ఛీ కొట్టిన భార్య....... ఆత్మహత్య చేసుకున్న భర్త
నీతో నీ ఇంటికి రానని, నీతో కాపురం చెయ్యను అని చైత్రా ఆమె భర్త నవీన్ కుమార్ కు తేల్చి చెప్పింది. భార్య చైత్రాను తన ఇంటికి పిలుచుకుని వెళ్లాలని నవీన్ కుమార్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భార్య చైత్రా ఇంటికి రాకపోవడంతో విసిగిపోయిన నవీన్ కుమార్ ఇట్టుమడులోని మారుతి నగర్ లోని అతని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications