బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: నా భార్య లేని ఈజీవితం ? భార్య చనిపోయిన రెండు రోజులకే భర్త కూడా, మనసు చంపుకోలేక !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. భార్య ఇంటి దగ్గరే ఉంటున్నది. వివాహం చేసుకున్న తరువాత దంపతులు ఇరువైపుల బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. కొంతకాలంగా భార్య అనారోగ్యానికి గురైయ్యింది. స్థానిక ఆసుపత్రులతో పాటు సిటీలోని ఆసుపత్రుల్లో భార్యకు వైద్యం చేయిస్తున్నాడు. భార్యకు త్వరగా వ్యాధి నయం కావాలని ఆమె భర్త ఇంతకాలం ఆలయాలు తిరిగాడు. ఇదే సందర్బంలో భార్య చనిపోయింది. భార్య చనిపోయిన రెండు రోజులకే భర్త కూడా ఈ లోకం వదిలి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు.

Illegal affair: సినిమా థియేటర్ లో ప్రియుడితో భార్య ఫుల్ బిజీ, ముందు సీట్లో భర్త, విశ్రాంతి, క్లైమాక్స్ ఒకేసారిIllegal affair: సినిమా థియేటర్ లో ప్రియుడితో భార్య ఫుల్ బిజీ, ముందు సీట్లో భర్త, విశ్రాంతి, క్లైమాక్స్ ఒకేసారి

 రెండు సంవత్సరాల క్రితం పెళ్లి

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని విజయపురలో సదాశివ రామప్ప అలియాస్ సదాశివ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రూపా (24) అనే యువతితో సదాశివ వివాహం జరిపించాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. సదాశివ, రూపా పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పడంతో వారి పెళ్లి జరిపించారు.

 సంతోషంగా కాపురం చేసిన దంపతులు

సంతోషంగా కాపురం చేసిన దంపతులు

కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న రూపా, సదాశివ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. భర్త సదాశివ బెళగావిలో వ్యాపారం చేస్తున్నాడు. సదాశివ భార్య రూపా ఇంటి దగ్గరే ఉంటున్నది. రోజు వ్యాపారం చెయ్యడానికి వెలుతున్న సదాశివ సాయంత్రం ఇంటికి వెళ్లిపోతున్నాడు. వివాహం చేసుకున్న తరువాత రూపా, సదాశివ దంపతులు ఇరువైపుల బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు.

 ఆసుపత్రుల చుట్టూ తిరిగిన భార్య

ఆసుపత్రుల చుట్టూ తిరిగిన భార్య

కొంతకాలంగా సదాశివ భార్య రూపా అనారోగ్యానికి గురైయ్యింది. విజయపురలోని ఆసుపత్రులతో పాటు బెళగావి సిటీలోని ఆసుపత్రుల్లో భార్య రూపా కు వైద్యం చేయిస్తున్న సదాశివ ఆమెకు వ్యాధి నయం చేయించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. భార్య రూపాకు త్వరగా వ్యాధి నయం కావాలని ఆమె భర్త సదాశివ ఇంతకాలం ఆలయాలు తిరిగాడు.

 అనారోగ్యంతో భార్య చనిపోతే ఆత్మహత్య చేసుకున్న భర్త

అనారోగ్యంతో భార్య చనిపోతే ఆత్మహత్య చేసుకున్న భర్త

ఇదే సందర్బంలో చికిత్స విఫలమై మూడు రోజుల క్రితం రూపా చనిపోయింది. భార్య చనిపోవడంతో సదాశివ ఆర్తనాదాలు చేశాడు. భార్య చనిపోయిన మూడు రోజులకే ఆమె భర్త సదాశివ ఇంటిలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలైన సదాశివను విజయపురలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సదాశివ శుక్రవారం చనిపోయాడు. భార్య రూపా లేని ఈ జీవితం తనకు వద్దూ అంటూ సదాశివ కూడా ఈ లోకం వదిలి వెళ్లిపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

English summary
Wife: Husband committed suicide because of his wife death at Belagavi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X