Wife: అక్రమ సంబంధం, మేడమ్ కు లేటుగా పెళ్లి చేస్తే ?, ప్రియురాలిని చంపేసి లైవ్ లో మాట్లాడిన ప్రియుడు !
వయసు ఎక్కువ అయిన సమయంలో ఆమెకు పెళ్లి అయ్యింది. ఇంట్లో ఉన్న భార్య ఊరి బయట దారుణ హత్యకు గురైయ్యింది. మహిళను హత్య చేసిన ఆమె మాజీ ప్రియుడు ఫేస్ బుక్ లైవ్ లో మ్యాటర్ మొత్తం చెప్పాడు.
బెంగళూరు/చామరాజనగర/హోసూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి సంతోషంగా జీవనం చేస్తోంది. వయసు ఎక్కువ అయిన సమయంలో ఆమెకు పెళ్లి అయ్యింది. భర్త ఇంటికి వెళ్లిన మహిళ అక్కడే నివాసం ఉంటూ సంతోషంగా ఉంది, వివాహం జరిగిన తరువాత కొన్నిసార్లు ఆమె పుట్టింటికి వెళ్లి వచ్చింది. భర్త పనిమీద ఊరికి వెళ్లాడు. భార్య మాత్రమే ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్న భార్య ఊరి బయట దారుణ హత్యకు గురైయ్యింది. మహిళను హత్య చేసిన ఆమె మాజీ ప్రియుడు ఫేస్ బుక్ లైవ్ లో మ్యాటర్ మొత్తం చెప్పి అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ మ్యాటర్ తో అందరూ హడలిపోయారు.

శాడిస్టు ఏం చేశాడంటే ?
మహిళను రాళ్లతో కొట్టి చంపిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకా నాగమలే గ్రామం సమీపంలోని పడసల్‌నాథ్‌లో చోటుచేసుకుంది. హనూర్ తాలూకా నాగమలే గ్రామానికి చెందిన లక్ష్మి(35) అనే మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన మునిరాజ్ అనే వ్యక్తి లక్ష్మీని హత్య చేసిన తరువాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

అసలు ఏం జరిగింది ?
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పెన్నాగారంలో నివాసముండే లక్ష్మికి, కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని నాగమలె గ్రామానికి చెందిన రమేష్‌తో గత 7 నెలల క్రితం వివాహం అయ్యింది. నాగమలకు భార్య లక్ష్మీని తీసుకు వచ్చిన రమేష్ ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. భర్త రమేష్ తో అతని భార్య లక్ష్యీ కూడా చాలా సంతోంగా ఉంటూ వచ్చింది.

ఊరికి వెళ్లిన భర్త
మంగళవారం లక్ష్మీ భర్త పనిమీద రమేష్ వేరే ఊరికి వెళ్లాడు. ఆ సమయంలో ధర్మపురిలో నివాసం ఉంటున్న మునిరాజు అనే వ్యక్తి లక్ష్మి ఇంటికి వెళ్లాడు. తరువాత లక్ష్మీని ఊరిబయటకు మునిరాజు పిలుచుకుని వెళ్లాడు. కొంతసేపు లక్షీతో మునిరాజుతో గొడవపడ్డాడు. తరువాత లక్ష్మీ తల మీద బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేసిన మునిరాజు వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫేస్ బుక్ లైవ్ లో ?
లక్ష్మిని చంపిన తరువాత మునిరాజు ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడాడు. నేనే లక్ష్మీని దారుణంగా హత్య చేశాను. నీ రక్తం చూసి నేను తట్టుకోలేకపోతున్నా, ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు అంటూ మునిరాజు ఏడుస్తూ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అక్రమ సంబంధం కారణంగానే లక్ష్మీ హత్య జరిగిందని, తరువాత మునిరాజు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా ఎస్పీ పద్మిని సాహో ఏఎస్పీ సుదేష్ అంటున్నారు. చామరాజనగరలోని మలేమహదేశ్వర బెట్ట పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications