• search

రెండో భార్యను కిడ్నాప్ చేసిన భర్త, సహకరించిన మహిళ, పోలీసులకు సినిమా స్టోరీ !

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    బెంగళూరు: భార్య తనను వదిలి వెళ్లిపోతుందని ఆందోళనలో ఆమెను మరో మహిళతో కలిసి భర్త కిడ్నాప్ చేశాడు. అనంతరం తన భార్యను ఆమె స్నేహితుడు కిడ్నాప్ చేశాడని బెంగళూరు నగరంలోని మడివాళ పోలీసులకు ఫిర్యాదు చేసి అడ్డంగా చిక్కిపోయాడు.

    షమీమ్ జమాల్ అనే వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. షమీమ్ జమాల్ కు గతంలో వేరే మహిళతో వివాహం జరిగిందని ఇటీవల రెండో భార్యకు తెలిసింది. భర్తను విడిచిపెట్టి వెళ్లిపోవాలని షమీమ్ జమాల్ రెండో భార్య నిర్ణయించింది.

    Wife kidnap case husband arrested by police in Bengaluru.

    తనను వదిలి భార్య వెళ్లిపోతుందని ఆందోళన చెందిన షమీమ్ జమాల్ తనకు తెలిసిన రాయల్ దేబికరే అనే మహిళ సహాయంతో రెండో భార్యను కిడ్నాప్ చేసి ఓ ఇంటిలో నిర్బంధించారు. ఆగస్టు 16వ తేదీన మడివాళ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన షమీమ్ జమాల్ తన భార్యను ఆమె స్నేహితుడు హుసేన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేశాడు.

    మడివాళ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. హుస్సేన్ మీద నిఘా వెయ్యడంతో అతను మహిళను కిడ్నాప్ చెయ్యలేదని తెలిసింది. షమీమ్ జమాల్ మీద అనుమానంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యడంతో అసలు విషయం అంగీకరించాడు.

    భార్యను కిడ్నాప్ చేసిన షమీమ్ జమాల్, అతనికి సహకరించిన రాయల్ దేబికరే అనే మహిళను అరెస్టు చేశామని మంగళవారం పోలీసులు తెలిపారు. రెండో భార్య కాపురం చెయ్యకుండా వెళ్లిపోతుందనే ఆందోళనతో తాను కిడ్నాప్ చేశానని విచారణలో షమీమ్ జమాల్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    Wife kidnap case husband arrested by police in Bengaluru.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more