యువకుడికి భార్య ఫ్లయింగ్ కిస్, చూసి చంపేసిన భర్త
కాన్పూర్: తన భార్య ఓ యువకుడికి ఫ్లయింగ్ కిస్ (గాల్లో ముద్దు) ఇవ్వడాన్ని చూసిన ఓ వ్యక్తి ఆమెను చంపేసిన సంఘటన కాన్పూర్‌లో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు.
పోలీసులు వివరాలను వెల్లడించారు.
పక్కింటిలో ఉన్న ఓ యువకుడికి నిందితుడి భార్య ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. దీనిని చూసిన అతను తన భార్యను చంపేశాడని చెప్పారు.
తన భార్య ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది నీకేనా అని అడిగేందుకు తాను ఆ యువకుడిని పిలిచానని, కానీ అతను రాలేదని నిందితుడు చెప్పాడని పోలీసులు చెప్పారు. అంతేకాదు, భార్యను కూడా ప్రశ్నించానని, కానీ తనను అవమానిస్తున్నామని ఆమె తనను నిందించిందని చెప్పాడని పోలీసులు తెలిపారు.

ఆ సమయంలో తమ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో ఆవేశంలో తాను ఆమెను కత్తితో పొడిచి చంపేశానని అతను చెప్పాడని పోలీసులు తెలిపారు. ఈ హత్య జూన్ 25వ తేదీన జరిగింది.
అయితే, నిందితుడు హత్యను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశాడు. తన ఇంట్లో రాబరీ జరిగిందని, దొంగలు భార్యను చంపేశారని పోలీసులకు, బంధువులకు చెప్పాడు. పోలీసులు విచారణ జరిపారు. భర్తనే నిందితుడు అని గుర్తించారు.












Click it and Unblock the Notifications