Wife: పెళైన నెలకే భార్య జంప్, పుట్టింట్లో ఉంటే తల్లి ఎలా అయ్యింది ?, ఫైటింగ్, అత్తను నరికేసిన అల్లుడు !
చెన్నై/కోయంబత్తూరు: దుస్తులు ఐరన్ చేస్తున్న యువకుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు. వేరే కులానికి చెందిన యువతి అతనికి పరిచయం అయ్యింది. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగి నెల రోజులు కాకముందే అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు కలిసిపోయారు. పెళ్లి జరిగిన నెల రోజులు కాకుండానే నవ దంపతుల మద్య తేడాలు రావడంతో విడిపోయాడు.
కొత్త పెళ్లి కూతురు భర్తతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే సమయంలో భార్య గర్బవతి అని ఆమె భర్తకు తెలిసింది. తన భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత గర్బవతి అయ్యింది, అక్రమ సంబంధం పెట్టుకున్న నా భార్య బిడ్డకు నేను తండ్రి కాదని, ఎవడికో పుట్టిన బిడ్డకు నేను తండ్రి ఎలా అవుతానని భర్త ఎదురు తిరిగాడు. ఇదే విషయంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంతో రగిలిపోయిన యువకుడు కొడవలి తీసుకుని అతని అత్త తల, ముఖం, మెడ మీద ఇష్టం వచ్చినట్లు నరికేయడం కలకలం రేపింది.

ఐరన్ చేస్తున్న యువకుడు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సూలురు సమీపంలోని రావత్తూరులో జీవానందం (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దుస్తులు ఐరన్ చేస్తున్న జీవానందం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు. కన్నయపాళ్యంలోని అన్నానగర్ లో నివాసం ఉంటున్న వేరే కులానికి చెందిన 20 ఏళ్ల యువతి అతనికి పరిచయం అయ్యింది.

అంతా ఆరు నెలల్లో జరిగిపోయింది
యువతి, జీవానందంల పరిచం కాస్తా ప్రేమగా మారింది. యువతిని జీవానందం గాఢంగా ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించిన జీవానందం అతని ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగి నెల రోజులు కాకముందే అమ్మాయి, అబ్బాయి జీవానందం కుటుంబ సభ్యులు కలిసిపోయారు.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
పెళ్లి జరిగి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే నవ దంపతుల మద్య తేడాలు రావడంతో విడిపోయాడు. కొత్త పెళ్లి కూతురు ఆమె భర్త జీవానందంతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దే సమయంలో భార్య గర్బవతి అని ఆమె భర్త జీవానందంకు తెలిసింది. పుట్టింటిలో ఉన్న నా భార్య గర్బవతి ఎలా అయ్యింది అంటూ జీవానందంకు అనుమానం పెరిగిపోయింది.

పంచాయితీలు చేసిన పెద్దలు
తన భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత గర్బవతి అయ్యంది, ఆమె ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని, నా భార్య బిడ్డకు నేను తండ్రి కాదని, ఎవడికో పుట్టిన బిడ్డకు నేను తండ్రి ఎలా అవుతానని జీవానందం ఎదురు తిరిగాడు. జీవానందం తండ్రి రామస్వామి పంచాయితీలు చెయ్యడానికి అతని కోడలి ఇంటికి వెళ్లాడు.
Recommended Video

తండ్రిని అవమానించారని అత్తను నరికేసిన అల్లుడు
జీవానందం భార్య తల్లి సెల్వి (47), ఆమె తండ్రి గోపాల్ (49) కలిసి రామస్వామిని చలకనగా మాట్లాడి అతని మీద దాడి చేసి ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆరోపణలు ఉన్నాయి. విసయం తెలుసుకున్న జీవానందం తన తండ్రినే అవమానిస్తారా అంటూ అర్దరాత్రి అతని భార్య ఇంటి దగ్గరకు వెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగిపోవడం, ఇదే విషయంలో గొడవ పెద్దది కావడంతో ఆవేశంతో రగిలిపోయిన జీవానందం కొడవలి తీసుకుని అతని భార్య తల్లి సెల్వీ ( అత్త) తల, ముఖం, మెడ మీద ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. తీవ్రగాయాలైన సెల్వీని కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అత్తను నరికేసిన జీవానందంను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications