Wife: భార్య ముక్కు కోసేసి సున్నం పెట్టుకోమని చెప్పిన మొగుడు, పుట్టింటిలో మకాం వేసిందని కోపంతో !
శివపురి/ఇండోర్: చక్కగా సంసారం చేసుకుంటున్న దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఉమ్మడి కుటుంబంలో భర్తతో కలిసి ఉంటున్న భార్యతో ఆమె భర్త అప్పుడప్పుడు గొడవలు పడేవాడు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇదే విషయంలో పెద్లలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంతకాలం తరువాత భార్య ఆమె పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. చాలా కాలం భార్య ఇంటికి తిరిగి వస్తుందని ఎదురు చూసిన భర్త చివరికి ఆమె మీద రగిలిపోయాడు. నేరుగా భార్య దగ్గరకు వెళ్లిన భర్త పదునైన కత్తి తీసుకుని ఆమె ముక్కు కోసేసి నువ్వు ఇంటికి వెళ్లి సున్నం పెట్టుకో అని ఎగతాలిగా చెప్పాడు. నీ వల్ల మా పరువు పోతుందని భర్త అతని భార్య మీద చిందులువేసి రెచ్చిపోయాడు. స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో భర్త, అతని తల్లిదండ్రులు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు.

కొన్ని సంవత్సరాల క్రితం !
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలోని బామోర్ సమీపంలోని కలాన్ గ్రామంలో రామ్ ప్రవేష్ వనశంకర్ అలియాస్ శంకర్ నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పూజా వంశ్కర్ అలియాస్ పూజా అనే యువతిని శంకర్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలు చక్కగా సంసారం చేసుకుంటున్న శంకర్, పూజా దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు.

ఉమ్మడి కుటుంబంలో సర్దుకోలేకపోయారు
ఉమ్మడి కుటుంబంలో భర్త శంకర్, పూజా దంపతులు కలిసి కాపురం చేస్తున్నారు. భార్య పూజాతో ఆమె భర్త శంకర్ అప్పుడప్పుడు గొడవలు పడేవాడు. పిల్లలు పుట్టిన తరువాత శంకర్, పూజా దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇదే విషయంలో పెద్లలు పంచాయితీలు చేసినా శంకర్, పూజా దంపతులు మారకపోవడంతో ఫలితం లేకుండా పోయింది.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
కొంతకాలం తరువాత పూజా ఆమె భర్త శంకర్ తో గొడవ పెట్టుకుని తరువాత ఆమె పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. పుట్టింటి వాళ్లు చేస్తున్న పొలం దగ్గరకు వెలుతున్న పూజా వారికి వ్యవసాయం చెయ్యడానికి సహాయం చేస్తోంది. చాలా కాలం భార్య పూజా తిరిగి తన ఇంటికి వస్తుందని ఎదురు చూసిన ఆమె భర్త శంకర్ విసిగిపోయి చివరికి ఆమె మీద రగిలిపోయాడు.

అమ్మానాన్నతో వెళ్లి భార్య ముక్కు కోసేసిన భర్త
మంగళవారం శంకర్ అతని తల్లిదండ్రులను వెంట పెట్టుకుని అతని భార్య పూజా ఉంటున్న చోటకు వెళ్లాడు. అక్కడ శంకర్, పూజా దంపతుల మద్య గొడవ జరిగి మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో శంకర్ తల్లిదండ్రులు పూజా చేతులు కాళ్లు గట్టిగా పట్టుకున్నారు. తరువాత శంకర్ పదునైన కత్తి తీసుకుని అతని భార్య పూజా ముక్కు కోసేసి నువ్వు ఇంటికి వెళ్లి సున్నం పెట్టుకో అని ఎగతాలిగా చెప్పాడు.
Recommended Video

ముక్కు తెగిపోవడంతో కేసు పెట్టిన భార్య
నీ వల్ల మా పరువు పోతుందని శంకర్ అతని భార్య పూజా మీద చిందులువేసి రెచ్చిపోయాడు. స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో శంకర్ తో పాటు అతని తల్లిదండ్రులు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు. బాధితురాలు పూజా ఆమె భర్త శంకర్ మీద, అతని తల్లిదండ్రుల మీద కేసు పెట్టిందని, పరారైన ముగ్గురి కోసం గాలిస్తున్నామని స్థానిక పోలీసు అధికారి నీరజ్ రానా చెప్పారని స్థానిక మీడియా అంటోంది. మొత్తం మీద భార్య పూజా ముక్కు కోసేసిన ఆమె భర్త శంకర్ చిక్కితే అతనికి బడితపూజ చెయ్యడానికి పోలీసులు సిద్దంగా ఉన్నారని తెలిసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications