వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగొచ్చి మరీ వేధింపులు.. భర్త టార్చర్‌తో నరకయాతన, గొంతుపై కాలితో నలిపి హత్య

|
Google Oneindia TeluguNews

భార్య భర్తల తరచూ గొడవలు సహజం.. ఇక మద్యానికి బానిసగా మారితే అంతే సంగతులు. ఎక్కడో ఓ చోట ఓపికగా ఉంటారు. కానీ కొన్ని చోట్ల పెషన్స్ నశిస్తే ఇక అంతే సంగతులు. బెంగళూరు‌లో కూడా అలానే జరిగింది. భర్త వేధింపులను భరించిన భార్య.. ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంది. చివరికీ భర్తనే హతమార్చింది. అతని వేధింపులు భరించిలేకపోయింది.

భార్య, భర్తల మధ్య వివాదం..

భార్య, భర్తల మధ్య వివాదం..

బెంగళూరు జగ్జీవన్‌రామ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. మద్యానికి బానిసగా మారిన భర్త.. తరచూ వేధిస్తుండేవాడు. వేధింపులు భరించిన భార్య.. చివరికీ భర్తను హతమార్చింది. అతని గొంతుపై కాలు పెట్టి మరీ చంపేసింది. బీబీఎంపీ చెత్త రవాణా చేసే ఆటో డ్రైవర్‌ మోహన్‌ భార్య పద్మా.. వీరి జీవితాన్ని మద్యం చిద్రం చేసింది.

16 ఏళ్ల కింద వివాహం

16 ఏళ్ల కింద వివాహం


బీబీఎంపీలోనే కాంట్రాక్టు పద్దతిలోనే పద్మ పౌర కార్మికురాలిగా పనిచేస్తున్నారు. 16 ఏళ్ళ కిందట వీరిద్దరికీ వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. మోహన్‌కు మద్యం సేవించే అలవాటు ఉండేది. ఇదే కారణంతో ఇరువురి మధ్య తరచూగా గొడవలు జరిగేవి. ఆరునెలల కిందట రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపించారు కూడా. కొంతకాలం మద్యానికి దూరంగా ఉన్న మోహన్‌ మరోసారి తాగుడుకు అలవాటు పడ్డారు. రాత్రి మద్యం తాగి వచ్చిన మోహన్‌ మరోసారి మద్యం కోసం భార్యను డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇలా గొడవ జరిగింది.

తెల్లవారుజామున 3.15 గంటలకు గొడవ

తెల్లవారుజామున 3.15 గంటలకు గొడవ

తెల్లవారు జామున 3.15 గంటల వేళ మరోసారి భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భార్య తోసివేయడంతో భర్త మోహన్‌ కిందపడ్డారు. ఇదే సమయంలో గొంతుపై కాలుతో తొక్కడంతో తీవ్ర అస్వస్థతకు గురికాగా... స్థానికంగా ఉండే వారి బంధువులు హుటాహుటిన కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. మోహన్‌ మృతి చెందాడు. జగజ్జీవన్‌రామ్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్య పద్మను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గొడవ జరిగిన సమయంలో పిల్లలు ఇంట్లో లేనట్లు తెలిసింది.

English summary
wife murdered by her husband at bangalore jagjivanram nagar police limits
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X