Wife: రిటైడ్ ఆర్మీ కెప్టెన్, బంధువుల ఇంటి నుంచి వెళ్లి ఇంట్లో భార్యను కాల్చి చంపేశాడు, కోడలు చూసి !

డెహ్రాడూన్: ఆర్మీలో మంచి ఉద్యోగం చేసిన వ్యక్తి రిటైడ్ అయ్యాడు. రిటైడ్ ఆర్మీ అధికారి అతని భార్యతో కలిసి సొంత ఊరిలో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. రిటైడ్ మాజీ ఆర్మీ అధికారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఓ కొడుకు నేవీలో, మరో కొడుకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కొడుకు నేవీలో ఉండటంతో అతని భార్య అత్తమామలతో కలిసి నివాసం ఉంటోంది. బంధువుల ఇంటికి వెళ్లిన రిటైడ్ ఆర్మీ అధికారి రెండు రోజులు అక్కడే ఉన్నాడు. తరువాత వేకువ జామున అతని ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత రిటైడ్ ఆర్మీ అధికారి దంపతుల మద్య ఏం జరిగిందో, ఏమో ? రివాల్వర్ తీసుకున్న రిటైడ్ ఆర్మీ అధికారి అతని భార్యను కాల్చి చంపేశాడు. అదే రివాల్వర్ తో రిటైడ్ ఆర్మీ అధికారి కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

రిటైడ్ ఆర్మీ అధికారి

రిటైడ్ ఆర్మీ అధికారి

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ సమీపంలోని రాణి పోక్రిలోని రఖ్ వాలా ప్రాంతంలో బ్రిజేష్ క్రిషాలి (58) నివాసం ఉంటున్నాడు. భారత ఆర్మీలో కెప్టెన్ గా ఉద్యోగం చేస్తూ రిటైడ్ అయిన బ్రిజేష్ క్రిషాలి అని సొంత ఊరికి చేరుకున్నాడు. రిటైడ్ ఆర్మీ అధికారి బ్రిజేష్ క్రిషాలి అతని భార్య కుసుమ్ (55)తో కలిసి సొంత ఊరిలో నివాసం ఉంటున్నాడు.

 ఉద్యోగాలు చేస్తున్న కొడుకులు

ఉద్యోగాలు చేస్తున్న కొడుకులు

బ్రిజేష్ క్రిషాలి, కుసుమ్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. బ్రిజేష్ పెద్ద కొడుకు నేవీలో, మరో కొడుకు ముంబాయిలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బ్రిజేష్ పెద్ద కొడుక్కి గత ఏడాది వివాహం జరిగింది. బ్రిజేష్ పెద్ద కొడుకు నేవీలో ఉండటంతో అతని భార్య అత్తమామలతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటోంది.

వ్యాపారం చేస్తున్న రిటైడ్ ఆర్మీ అధికారి

వ్యాపారం చేస్తున్న రిటైడ్ ఆర్మీ అధికారి


రిటైడ్ ఆర్మీ అధికారి బ్రిజేష్ క్రిషాలి అతను నివాసం ఉంటున్న ఏరియాలోనే స్టేషనరీ షాపు నిర్వహిస్తూ వ్యాపారం చేసుకుంటున్నాడు. బ్రిజేష్ కు సొంతపొలం ఉండటంతో వ్యవసాయం కూడా చేయిస్తున్నాడు. భార్య కుసుమ్ తో కలిసి బ్రిజేష్ చాలా సంతోషంగానే ఉంటున్నాడని బంధువులు, స్థానికులు అంటున్నారు.

బంధువుల ఇంటి నుంచి వెళ్లి భార్యను కాల్చి చంపేశాడు

బంధువుల ఇంటి నుంచి వెళ్లి భార్యను కాల్చి చంపేశాడు


ఇటీవల బ్రిజేష్ అతని బంధువుల ఇంటికి వెళ్లాడు. రిటైడ్ ఆర్మీ అధికారి బ్రిజేష్ రెండు రోజులు బంధువుల ఇంటిలోనే ఉన్నాడు. తరువాత వేకువ జామున బ్రిజేష్ అతని ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత రిటైడ్ ఆర్మీ అధికారి బ్రిజేష్, కుసుమ్ దంపతుల మద్య ఏం జరిగిందో, ఏమో ? తెలీదు. ఆవేశంతో రగిలిపోయిన రిటైడ్ ఆర్మీ అధికారి బ్రిజేష్ ఇంట్లో ఉన్న రివాల్వర్ తీసుకుని అతని భార్య కుసుమ్ మీద రెండు రౌండ్లు కాల్పులు జరిపి దారుణంగా కాల్చి చంపేశాడు.

ఆత్మహత్య చేసుకున్న రిటైడ్ ఆర్మీ అధికారి

ఆత్మహత్య చేసుకున్న రిటైడ్ ఆర్మీ అధికారి

భార్య కుసుమ్ ను ఏ రివాల్వర్ తో కాల్చి చంపేశాడో అదే రివాల్వర్ తో రిటైడ్ ఆర్మీ అధికారి బ్రిజేష్ కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న వ్యక్తికి తుపాకి కాల్పుల శభ్దం వినిపించడంతో బ్రిజేష్ ఇంటి వైపు పరుగు తీశాడు. అదే సమయంలో బ్రిజేష్ కోడులు కూడా ఇంట్లో నుంచి కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది.

 ఏం జరిగిందో తెలీదు ?

ఏం జరిగిందో తెలీదు ?

బ్రిజేష్, కుసుమ్ దంపతుల మద్య ఏం జరిగింది ?, ఎందుకు భార్య కుసుమ్ ను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు ? అనే విషయంలో పక్కా సమాచారం లేదని, కేసు విచారణలో ఉందని రిషికేష్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ డిసీ డౌండియా స్థానిక మీడియాకు చెప్పారు. అయితే ఇంతకాలం అన్యోన్యంగా ఉంటున్న దంపతులు ఇలా శవమై కనిపించడంతో వారి బంధువులతో పాటు స్థానికులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+