Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: ఫస్ట్ భార్యతో ?, రెండో భార్యతో హ్యాపీ, రాత్రి నైడ్ డ్యూటీ, రెండో భార్యతో కలిసి భర్త ఆత్మహత్య, మ్యాటర్

చెన్నై/ తిరువళ్లూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొన్ని సంవత్సరాలు సంతోషంగానే కాపురం చేశారు. మొదటి భార్యతో తేడాలు రావడంతో అతను మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి భార్యలతో నాలుగు సంవత్సరాలు సంతోషంగా ఉన్న అతను తరువాత రెండో భార్యతోనే సెటిల్ అయిపోయాడు. రెండో భార్యతో కాపురం చేస్తూ ఆమెతోనే ఉండిపోయాడు. రెండో భార్యకు ఓ కూతురు కూడా ఉంది. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భర్త అతని రెండో భార్య, కూతురిని పోషిస్తున్నాడు. రెండో భార్య ఇంట్లోనే ఉంటూ కూతురిని చదివిస్తోంది.

నైట్ డ్యూటీకి వెళ్లిన భర్త ఉదయం ఇంటికి వెళ్లాడు. ఉదయం కూతురు స్కూల్ కు వెళ్లింది. తరువాత దంపతులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్లిన కూతురు షాక్ అయ్యింది. ఇంట్లో అమ్మా,నాన్న ఉరి వేసుకున్న విషయం గుర్తించిన కూతురు కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో భార్యతో కలిసి భర్త ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

మొదటి భార్యతో ?

మొదటి భార్యతో ?

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కడంబత్తూరు యూనియన్ ఏరియాలోని నల్లత్తూరులోని శంకరాచారి వీధిలో వడివేలు (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వడివేలు ఇంట్లో చూపించిన మహిళను వివాహం చేసుకున్నాడు. మహిళను వివాహం చేసుకున్న వడివేలు అతని భార్యతో కొన్ని సంవత్సరాలు సంతోషంగానే కాపురం చేశారు.

 రెండో పెళ్లి చేసుకున్నాడు

రెండో పెళ్లి చేసుకున్నాడు

మొదటి భార్యతో తేడాలు రావడంతో వడివేలు 14 సంవత్సరాల క్రితం రేవతి (33) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వడివేలు, రేవతి దంపతులకు పూజా (13) అనే కుమార్తె ఉంది. ఇద్దరి భార్యలతో నాలుగు సంవత్సరాలు కాలం గడిపేసిన వడివేలు తరువాత రెండో భార్య రేవతితోనే సెటిల్ అయిపోయాడు.

 సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం

సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం

రెండో భార్య రేవతితో కాపురం చేస్తూ ఆమెతోనే ఉండిపోయాడు. రెండో భార్య కూతురు పూజా సమీపంలోని స్కూల్ లో 7వ తరగతి చదువుతోంది. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న వడివేలు అతని రెండో రేవతి భార్య, కూతురు పూజాను పోషిస్తున్నాడు. ఇటీవల రెండో భార్య రేవతి బర్త్ డే సందర్బంగా వడివేలు కొత్త బైక్ కూడా తీసుకున్నాడు. వడివేలు రెండో భార్య రేవతి ఇంట్లోనే ఉంటూ ఆమె కూతురు పూజాను చదివిస్తోంది.

 కూతురు స్కూల్ కు వెళ్లిన తరువాత ?

కూతురు స్కూల్ కు వెళ్లిన తరువాత ?

కంపెనీలో నైట్ డ్యూటీకి వెళ్లిన వడివేలు ఉదయం ఇంటికి వెళ్లాడు. ఉదయం వడివేలు కూతురు పూజా స్కూల్ కు వెళ్లింది. తరువాత వడివేలు, రేవతి దంపతులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్లిన కూతురు పూజా ఇంట్లో ఫ్యాన్ కు తల్లిదండ్రులు వేలాడుతున్న విషయం గుర్తించి షాక్ అయ్యింది.

 అసలు మ్యాటర్ మాత్రం తెలీదు

అసలు మ్యాటర్ మాత్రం తెలీదు

ఇంట్లో అమ్మా,నాన్న రేవతి, వడివేలు ఉరి వేసుకున్న విషయం గుర్తించిన కూతురు కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో భార్య రేవతితో కలిసి ఆమె భర్త వడివేలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రేవతి, వడివేలు ఆత్మహత్యలకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+