భర్త ఫోన్‌ ‌దొంగతనం ..ఇక్కడే అసలు ట్విస్ట్..బయటపడ్డ భార్య అక్రమ సంబంధం

ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ, నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగుచూస్తుంటే, విస్మయం కలుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఓ ఫోన్ చోరీ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ దొంగతనం అనుకున్నది, ఓ వివాహేతర సంబంధం చుట్టూ అల్లిన నాటకమని తేలింది.

వివరాల్లోకి వెళ్తే, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్న ఒక వ్యక్తి ఫోన్‌ను ఓల్డ్ యూకే పెయింట్ ఫ్యాక్టరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి లాక్కున్నారు. అయితే, ఈ చోరీ వెనుక అసలు కుట్ర ఆ భర్త భార్యదే అని పోలీసులు గుర్తించారు.

Wife steals husband s phone extramarital affair exposed

ఆమె భర్త తన ఫోన్‌లో తన వివాహేతర సంబంధానికి సంబంధించిన సన్నిహిత ఫొటోలను రహస్యంగా బదిలీ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య, ఆ ఫోటోలను తొలగించడానికి ఈ ఫోన్ దొంగతనాన్ని ప్లాన్ చేసింది. విచారణలో, ఆమె భర్తకు మూడు నెలల క్రితమే తన వివాహేతర సంబంధం గురించి తెలిసిందని తేలింది.

సీసీటీవీ ఫుటేజ్, స్కూటర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా పోలీసులు దొంగ అంకిత్ గహ్లోట్‌ను రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లా బలోత్రాలో అరెస్టు చేశారు. గహ్లోట్ విచారణలో, భార్య, ఆమె ప్రేమికుడు కలిసి ఈ దొంగతనాన్ని ప్లాన్ చేశారని, భార్య తన భర్త దినచర్య వివరాలను వారికి అందించడం ద్వారా నేరానికి సహకరించిందని ఒప్పుకున్నాడు.

దొంగిలించిన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఆమె ప్రేమికుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ఫోన్ దొంగతనం కేసు, చివరికి ఓ వ్యక్తిగత సంబంధంలోని సంక్లిష్టతలను బయటపెట్టడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+