Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: సార్, మేడమ్ ఇద్దరికి రెండో పెళ్లి, సెకండ్ మ్యారేజ్ సీక్రేట్స్, సీన్ కట్ చేసే నిమిషాల్లో మూడు శవాలు !

పోలీసులకు ఫోన్ చేసిన మహిళ తన రెండో భర్త, అతని మొదటి భార్య ఇద్దరు కుమారులను దారుణంగా నరికి చంపేశారని ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు సెకండ్ మ్యారేజ్ సీక్రేట్స్ బయటకు వచ్చాయి.

లక్నో/గోరక్ పూర్/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో ఇతని భార్య చనిపోయింది. ఇతనికి డబ్బులు, ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి. ఇదే సమయంలో భర్తను వదిలేసి దూరంగా ఉంటున్న మహిళను అతను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మొదటి భర్తతో కాపురం చేసిన మహిళకు అప్పటికే కూతురు ఉంది. ఇద్దరు ఇష్టపడి రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య ఇద్దరి పిల్లలతో భర్త, మొదటి భర్తకు పుట్టిన కూతురితో రెండో భార్య కలిసి అందరూ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. పోలీసులకు ఫోన్ చేసిన మహిళ తన భర్త, అతని మొదటి భార్య ఇద్దరు కుమారులను దారుణంగా నరికి చంపేశారని ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు సెకండ్ మ్యారేజ్ సీక్రేట్స్ బయటకు వచ్చాయి.

భార్య చనిపోయింది

భార్య చనిపోయింది

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోని సహజన్వాన్ ప్రాంతంలో అవదేశ్ గుప్తా (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం ఓ మహిళను అవదేశ్ గుప్తా వివాహం చేసుకున్నాడు. అవదేశ్ గుప్తా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అవదేశ్ గుప్తా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. రెండు సంవత్సరాల క్రితం అవదేశ్ గుప్తా అనారోగ్యంతో చనిపోయింది.

భారీ మొత్తంలో డబ్బులు, ఆస్తులు ఉన్నాయి

భారీ మొత్తంలో డబ్బులు, ఆస్తులు ఉన్నాయి

అవదేశ్ గుప్తాకు డబ్బులతో పాటు కోట్ల రుపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. భార్య చనిపోవడంతో ఇద్దరు కుమారుల బాగోలు చూసుకోవడనికి రెండో పెళ్లి చేసుకోవాలని అవదేశ్ గుప్తాకు అతని బంధువులు, స్నేహితులు సూచించారు. వయసులోనే ఉన్న అవదేశ్ గుప్తా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. ఇదే సమయంలో అవదేశ్ గుప్తా రెండో పెళ్లి కోసం అమ్మాయిలను చూశాడు.

భర్తను వదిలేసింది

భర్తను వదిలేసింది

నీలమ్ అనే మహిళ వివాహం చేసుకుని ఓ కూతురికి తల్లి అయ్యింది. కొన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన నీలమ్ తరువాత గొడవ కారణంగా భర్తకు దూరం అయ్యింది. కూతురితో కలిసి నివాసం ఉంటున్న నీలమ్ భార్య చనిపోయిన అవదేశ్ గుప్తాకు పరిచయం అయ్యింది. నీలమ్ చూడటానికి సినిమా హీరోయిన్ లాగా ఉండటంతో ఆమె మీద అవదేశ్ గుప్తా మోజుపడ్డాడు. తరువాత అవదేశ్ గుప్తా, నీలమ్ దగ్గర అయ్యారు, అవేదశ్ గుప్తాకు ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉండటంతో నీలమ్ అతన్ని గత ఏడాది రెండో పెళ్లి చేసుకుంది.

సెకండ్ మ్యారేజ్ సీక్రేట్స్

సెకండ్ మ్యారేజ్ సీక్రేట్స్

నీలమ్ కు రెండో పెళ్లి, అవదేశ్ గుప్తాకు రెండో పెళ్లి. నీలమ్ కుమార్తె. అవదేశ్ గుప్తా మొదటి భార్య కుమారులు ఇద్దరూ కలిసి అందరూ ఒకే ఇంటిలోల నివాసం ఉంటున్నారు. ఓ రోజు రాత్రి భర్త అవదేశ్ గుప్తాతో రొమాన్స్ చేసిన నీలమ్ ఆస్తి భాగాల విషయంలో చర్చ మొదలుపెట్టింది. తరువాత అవదేశ్ గుప్తా ఆస్తి పంపకాల విషయంలో వాయిదాలు వేస్తూ వచ్చాడు. నీలమ్ టార్చర్ తట్టుకోలేక అవదేశ్ గుప్తా అతని మనసులోని మాటను బయటపెట్టేశాడు.

మనసులో మాట చెప్పేశాడు

మనసులో మాట చెప్పేశాడు

నా ఆస్తి మొత్తం నా మొదటి భార్య కుమారులకు రాసి ఇస్తానని అవదేశ్ గుప్తా అతని రెండో భార్య నీలమ్ కు చెప్పాడు. ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటే తన భర్త అవదేశ్ గుప్తా మొదటి భార్య కుమారులకు ఆస్తి రాసిస్తానని చెప్పడంతో రగిలిపోయిది. నా రెండో భర్త అవదేశ్ గుప్తాతో పాటు అతని ఇద్దరు కుమారులను హత్య చేస్తే ఆస్తి మొత్తం నాకే వస్తుందని నీలమ్ స్కెచ్ వేసింది. ఆదివారం రాత్రి రెండో భర్త అవదేశ్ గుప్తాతో పాటు అతని మొదటి భార్య ఇద్దరు కుమారులను నీలమ్ నరికి చంపేసింది.

నీలమ్ కన్నింగ్ స్కెచ్

నీలమ్ కన్నింగ్ స్కెచ్

పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన నీలమ్ తన రెండో భర్త అవదేశ్ గుప్తాతో పాటు అతని ఇద్దరు కుమారులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారని చెప్పింది. పోలీసులు సుమారు 10 గంటల పాటు నీలమ్ ను విచారణ చేస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. ఆస్తి కోసం రెండో భర్త అవదేశ్ గుప్తాతో పాటు అతని ఇద్దరు కుమారులను నీలమ్ దారుణంగా హత్య చేసిందని వెలుగు చూడటంతో ఆమెను అరెస్టు చేశామని గోరక్ పూర్ పోలీసులు తెలిపారు. నీలమ్ కు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందుకే రెండో భర్తను చంపేసి ఆస్తి మొత్తం లాక్కొని ప్రియుడితో కలిసి ఉండాలని స్కెచ్ వేసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+