Wife: వారం క్రితం పెళ్లి, భర్తతో షాపింగ్, భర్త కళ్ల ముందే కారులో ప్రియుడితో కొత్త పెళ్లి కూతురు జంప్ !

పాట్నా/ బీహార్: కుటుంబ సభ్యులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని యువతి ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. అమ్మాయి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారం రోజుల క్రితం పెళ్లి జరిగిపోయింది. పెళ్లికి వెళ్లిన బంధువులు, స్నేహితులు జంట చూడముచ్చటగా ఉందని అన్నారు. పెళ్లి జరిగిన తరువాత మూడు రోజులు పెళ్లి కూతురు ఆమె పుట్టింటిలోనే ఉంది. భర్త ఇంటికి వెళ్లిన భార్య తాను షాప్ లో కొన్ని వస్తువులు తీసుకోవాలని భర్తకు చెప్పింది. కొత్త పెళ్లి కూతురిని ఆమె భర్త షాపింగ్ కు పిలుచుకుని వెళ్లాడు. గంటసేపు షాపింగ్ చేసిన తరువాత దంపతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని షాపులో నుంచి బయటకు వచ్చారు. ఒక్కసారిగా భర్త చెయ్యి వదిలించుకున్న కొత్త పెళ్లి కూతురు సమీపంలో స్కార్పియో కారు పెట్టుకుని రెఢీగా ఉన్న ప్రియుడితో కలిసి పారిపోయింది. తన కళ్ల ముందే భార్య ఆమె ప్రియుడితో పారిపోతుంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఆమె భర్త చూస్తూ ఉండిపోయాడు.

 పెళ్లికి గ్రీన్ సిగ్నల్

పెళ్లికి గ్రీన్ సిగ్నల్

బీహార్ లోని కౌత్వాలి ప్రాంతంలో వివేక్ ఉద్దార్ అలియాస్ వివేక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు నెలల క్రితం నౌవర్గసి ప్రాంతంలో నివాసం ఉంటున్న రామ్ విలాస్ అనే ఆయన కుమార్తె మౌనీతో వివేక్ పెళ్లి జరిపించాలని పెద్దలు చర్చించారు. కుటుంబ సభ్యులు చూపించిన వివేక్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని మౌనీ ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది.

 వారం క్రితం గ్రాండ్ గా పెళ్లి

వారం క్రితం గ్రాండ్ గా పెళ్లి

మౌనీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారం రోజుల క్రితం వివేక్ తో ఆమె పెళ్లి జరిగిపోయింది. పెళ్లికి వెళ్లిన బంధువులు, స్నేహితులు వివేక్, మౌనీ జంట చూడముచ్చటగా ఉందని అన్నారు. పెళ్లి జరిగిన తరువాత మూడు రోజులు పెళ్లి కూతురు మౌనీ ఆమె పుట్టింటిలోనే ఉంది. పెళ్లి కూతురు మౌనీ వెంట పెళ్లి కొడుకు వివేక్ ఉన్నాడు.

 షాపింగ్ చెయ్యాలని భర్తకు చెప్పింది

షాపింగ్ చెయ్యాలని భర్తకు చెప్పింది

మూడు రోజుల క్రితం మౌనీ ఆమె భర్త వివేక్ ఇంటికి వెళ్లింది. భర్త వివేక్ ఇంటికి వెళ్లిన మౌనీ తాను షాప్ లో కొన్ని వస్తువులు తీసుకోవాలని భర్తకు చెప్పింది. కొత్త పెళ్లి కూతురు మౌనీని ఆమె భర్త వివేక్ చౌకాపుర ఏరియాలోని సంతోషిమాతా కాలనీలో షాపింగ్ కు పిలుచుకుని వెళ్లాడు. గంటసేపు షాపింగ్ చేసిన తరువాత వివేక్, మౌనీ దంపతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని షాపులో నుంచి బయటకు వచ్చారు.

 ప్రియుడితో కొత్త పెళ్లి కూతురు జంప్

ప్రియుడితో కొత్త పెళ్లి కూతురు జంప్

షాపులో నుంచి బయటకు వెళ్లిన తరువాత భర్త వివేక్ చెయ్యి వదిలించుకున్న కొత్త పెళ్లి కూతురు మౌనీ సమీపంలో స్కార్పియో కారు పెట్టుకుని రెఢీగా ఉన్న ప్రియుడితో కలిసిపారిపోయింది. తన కళ్ల ముందే భార్య మౌనీ ఆమె ప్రియుడితో పారిపోతుంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఆమె భర్త వివేక్ చూస్తూ ఉండిపోయాడు.

 భార్య లేచిపోయిందని కేసు పెట్టిన భర్త

భార్య లేచిపోయిందని కేసు పెట్టిన భర్త

చివరికి అసలు మ్యాటర్ తెలుసుకున్న వివేక్ కోత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. తన భార్య మౌనీ దగ్గర మేము చేయించిన బంగారు నగలు ఉన్నాయని, నన్ను మోసం చేసి మా కుటుంబం పరువు తీసిన మౌనీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వివేక్ పోలీసు కేసు పెట్టాడు. పెళ్లి జరిగిన వారం రోజులకే పెళ్లి కూతురు ఆమె ప్రియుడితో పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+