మరో ఛాన్స్ ప్లీజ్: డెవలప్ టు బీ కంటిన్యూ.. ర్యాలీలో నితీశ్, తేజస్వీ యాదవ్‌పై నిప్పులు
బీహర్ ప్రజలు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కోరారు. తమ కూటమిని గెలిపించాలని విన్నవించారు. సోమవారం ముజఫర్ నగర్‌లో గల సక్రా అసెంబ్లీ నియోజకవర్గంలో నితీశ్ కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థి అశోక్ కుమార్ చౌదరీ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌పై నిప్పులు చెరిగారు.
Recommended Video
తన లక్ష్యంగా విమర్శలు చేసి తేజస్వీ యాదవ్ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కొందరు తనపై ఆరోపణలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. కానీ తాను అలా కాదని చెప్పారు. బీహర్ అభివృద్ది కోసం కంకణం కట్టుకున్నానని చెప్పారు. దానిని కంటిన్యూ చేస్తానని.. మరో అవకాశం ఇవ్వాలన కోరారు.

ఆర్జేడీ హయాంలో గుండారాజ్ అధికారంలో ఉండేదని చెప్పారు. కుమారులు, కూతుళ్లు అందరూ కలిసి రాష్ట్రాన్ని ఏలేవారని పేర్కొన్నారు. కానీ తన కుటుంబమే రాష్ట్రం అని నితీశ్ కుమార్ స్పష్టంచేశారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు కంటిన్యూ కావాలన్న.. సంక్షేమ పథకాలు రూపుదాల్చుకోవాలన్న తమ పార్టీని గెలిపించాలని నితీశ్ కుమార్ కోరారు.
రాష్ట్రంలో రహదారులను నిర్మించామని, మంచినీరు అందించామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి కూడా అనేక రెట్లు పెరిగిందన్నారు. మరో చాన్స్ ఇస్తే సోలార్ వెలుగులతో వీధి దీపాలను అందిస్తామని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన తొలి రాష్ట్ర ప్రభుత్వం తమదేనని చెప్పారు. తొలుత బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశామని.. తర్వాత బాలురకు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. వేలాది పాఠశాల భవనాలు నిర్మించామని.. వైద్యారోగ్య సేవలను పెంచామని తెలిపారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications