ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్ హత్యకు ముహూర్తం: ఏకంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కే ఫోన్ కాల్
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు ఆగట్లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ ఆయనకు బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తోన్నాయి. సల్మాన్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు గ్యాంగ్‌స్టర్లు. సల్మాన్ ఖాన్‌ను హత మార్చడమే తన లక్ష్యమంటూ ఇదివరకే లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించుకున్నాడు కూడా.
ఈ బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ గన్ లైసెన్స్‌ను మంజూరు చేశారు. ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఆయుధ లైసెన్స్‌ను కూడా మంజూరు చేశారు. అయినప్పటికీ- ప్రాణాపాయ బెదిరింపులకు బ్రేకులు పడట్లేదు. మరోసారి ఆయనకు బెదిరింపులు అందాయి. ఈ సారి గుర్తు తెలియని వ్యక్తి నేరుగా ముంబై పోలీసులకే ఫోన్ చేశాడు.

సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి ముహూర్తం పెట్టినట్లు చెప్పాడు. ఈ నెల 30వ తేదీన ఆయనను చంపేస్తానని స్పష్టం చేశాడు. ఈ మేరకు గుర్తు తెలియని నంబర్ నుంచి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. సల్మాన్ ఖాన్‌ను హత మార్చనున్నట్లు నేరుగా ముంబై పోలీసులకే సమాచారం ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనితో వారు అప్రమత్తం అయ్యారు. దర్యాప్తు మొదలు పెట్టారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను రాకీ భాయ్గా పరిచయం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి ఫోన్ చేస్తోన్నట్లు వివరించాడని చెప్పారు. జోధ్‌పూర్‌లో కృష్ణజింకలను వేటాడిన నేపథ్యంలో ఆయనపై పగ తీర్చుకుంటామంటూ ఇదివరకే ఆయనకు బెదిరింపు లేఖలు, మెయిల్స్ అందాయి. ఆయన తండ్రి సలీమ్ ఖాన్ పేరు సైతం వాటిల్లో పొందుపరిచారు.

ప్రాణభయం ఉన్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్.. తాను రోజూ వినియోగించే ల్యాండ్ క్రూయిజ్ కారును అప్‌గ్రేడ్ చేసుకున్నాడు. దాన్ని బుల్లెట్ ప్రూఫ్‌గా బదలాయించుకున్నాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి బుల్లెట్లు తగిలినా ధ్వంసం కాని విధంగా కారును అప్‌గ్రేడ్ చేశాడు. సిద్ధు మూసేవాలా కారులో ప్రయాణిస్తోన్న సమయంలోనే హత్య చేసిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ బెదిరింపు లేఖ నేపథ్యంలో- సల్మాన్ ఖాన్ నివాసానికి పోలీసులు భద్రత పెంచారు.
-
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications