వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపలకూర మిస్సవుతా: గోవా సిఎం మనోహర్ పారికర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను ఒకవేళ కేంద్రమంత్రినై ఢిల్లీకి వెళ్లిపోతే తనకు ఇష్టమైన చేపల కూరను మిస్సవుతానని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. కీలకమైన రక్షణ శాఖ, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న అరుణ్ జైట్లీపై భారాన్ని తగ్గించేందు కోసం రక్షణశాఖను మనోహర్ పారికర్‌కు కేటాయించే అవకాశాలున్నాయి.

58ఏళ్ల గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయ్యాయి. పారికర్ మంచి పరిపాలనదక్షుడు కావడంతో బిజెపి అధిష్టానం అతనికే రక్షణ శాఖను అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పారికర్ కొద్ది రోజుల్లోనే కేంద్రమంత్రిగా రాష్ట్రం వదిలి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో ఆయన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. గోవాకి సంబంధించి మీరు ఏం మిస్సవబోతున్నారు? అని మీడియా అడిగిన ప్రశ్నకు పారికర్ సమాధానం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాను గోవా చేపల కూరను చాలా మిస్సవుతానని ఆయన పేర్కొన్నారు.

Will miss Goan fish curry, says outgoing CM Manohar Parrikar

అయితే రోజుకు 16 నుంచి 18 గంటలపాటు పని చేసే తాను ఏ మాత్రం హడావుడి పడకుండా ప్రశాంతంగా ఉండే గోవా సంస్కృతిని మాత్రం ఒంటబట్టించుకోలేదని అన్నారు. పారికర్ ముంబై ఐఐటీ చదువుతకున్నారు.

కష్టజీవిగా, మచ్చలేని నేతగా పేరొందిన మనోహర్ పారికర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శనివారం ఆయన సిఎం పదవికి రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే మనోహర్ పారికర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, బిజెపి పార్లమెంటరీ సమావేశం తర్వాత శనివారం గోవా సిఎం పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశముందని తెలిపాయి. త్వరలోనే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, శనివారం సాయంత్రం గోవా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని మనోహర్ పారికర్ చెప్పారు.

English summary
Goa Chief Minister Manohar Parrikar, who is likely to become India's next defence minister, will miss fish-curry rice once he leaves for New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X