దెబ్బకు దిగింది: పెప్సీ, కోకాకోలా బ్యాన్: వీటికి భలే గిరాకీ వచ్చేసింది
చెన్నై: జల్లికట్టును అడ్డుకుంటున్న పేటా సంస్థను నిషేధించాలని తమిళనాడులో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలకు పలు వ్యాపార సంఘాలు, సినీ పరిశ్రమ ప్రముఖులు, అనేక రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ఇస్తున్నారు.
జల్లికట్టు నిర్వహణ కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తూ తమిళనాడులో విదేశీ శీతల పానీయాలైన పెప్సీ, కోకాకోలా విక్రయాలు నిలిపివేస్తున్నామని వ్యాపార సంఘాలు తేల్చిచెప్పాయి.

ఇప్పటికే తమిళనాడులోని అనేక సినిమా థియేటర్లలో పెప్సీ, కోకాకోలా శీతలపానీయాల విక్రయాలు బ్యాన్ చేశారు. పెప్సీ, కోకాకోలా స్థానంలో స్వదేశీయంగా తయారు అవుతున్న గోలీ సోడా, కలర్ సోడా, నిమ్మకాయ సోడాలు అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఫ్రీజర్ లలో పెట్టిన గోలీ సోడా, నిమ్మకాయ సోడా, కలర్ సోడాలు ఇప్పుడు సినిమా థియేటర్లలో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఎలాగైనా మన దేశంలో తయారు అవుతున్న సోడాలకు ఇప్పుడు భలే గిరాకి వచ్చిందని సినిమా థియేటర్లకు వెలుతున్న సినీ అభిమానులు అంటున్నారు.
అంతే కాకుండా చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని వివిద జిల్లాల్లో గోలీ సోడాల విక్రయాలు ఊపందుకున్నాయి. జల్లికట్టు ఆందోళన పుణ్యమా అంటూ మా వ్యాపారాలు జోరందుకున్నాయని గోలీ సోడాలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు అంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications