విప్రోలో ఈ ఏడాది భారీ హైక్: 1.72 లక్షల మందికి పెంపు

: భారత్‌లో మూడవ అతిపెద్ద సాప్ట్‌వేర్ సేవల సంస్ధగా కొనసాగుతున్న విప్రో ఈ ఏడాది ఉద్యోగులకు భారీ వేతనాల పెంపును ప్రకటించింది. జూన్ 1 నుంచి అమలు కానున్న ఈ వేతన పెంపు విప్రో సంస్ధలో పనిచేస్తున్న 1,72,912 మంది ఉద్యోగులకు అమలవుతుందని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ఉద్యోగులకు సరాసరిన 9.5 శాతం వేతనాల పెంపును కంపెనీ ప్రకటించింది. "అర్హులైన ఉద్యోగులకు జూన్ 1 నుంచి వేతనాల పెంపు అమలవుతుంది. ఇండియాలోని ఉద్యోగులకు సరాసరిన 9.5 శాతం, ఆన్‌సైట్ ఉద్యోగులకు సరాసరిన 2 శాతం వరకూ వేతనాల పెంపు ఉంటుంది. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి వేతనాల పెంపు అధికం" అని విప్రో పేర్కొంది.

 Wipro Staff To Get Average 9.5% Salary Hike This Year

మార్చి 31, 2016 నాటికి విప్రో సంస్ధలో 1,72,912 మంది ఉద్యోగులు పే రోల్స్‌లో ఉన్నారు. కాగా విప్రో సంస్ధకు పోటీగా ఉన్న ఇన్ఫోసిస్ సంస్ధ భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు 6 నుంచి 12 శాతం, ఆన్ సైట్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు 2 శాతం వేతనాలను పెంచిన సంగతి తెలిసిందే.

సాప్ట్‌వేర్ రంగంలో భారత్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీసీఎస్ కూడా తమ ఉద్యోగులకు 8 నుంచి 12 శాతం వేతనాలను పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+