షూలో కెమెరా: మహిళల అసభ్య ఫొటోలు తీశాడు

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి తన షూలో రహస్య కెమెరా పెట్టుకుని, దాని ద్వారా మహిళలను అసభ్యకరంగా ఫొటోలు తీసి అడ్డంగా దొరికిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అతడ్ని కటకటాల వెనక్కినెట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి(34) తన షూలో రహస్య కెమెరాను ఏర్పాటు చేసుకొని.. పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్‌లో మహిళలు దుస్తులు మార్చుకునే గది వద్దకు వెళ్లి.. దాని ద్వారా ఫొటోలు తీస్తున్నాడు.

కెమెరా అమర్చిన ఆ షూను తన కాలుతో ట్రయల్‌ రూమ్‌ తలుపు కిందుగా కాస్త లోనికి పోనిచ్చి ఫొటోలు తీస్తున్నాడు. కాగా, ఆ వ్యక్తి అక్కడ నిల్చొని ఉండటాన్ని షాపింగ్‌ మాల్‌ మేనేజర్‌ గమనించాడు.

With Camera Hidden in Shoe, He Took Obscene Photos of Women

అనుమానం వచ్చిన మేనేజర్‌ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి విచారించగా.. వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో సెక్యూరిటీ గార్డ్సు అతనిని పట్టుకుని సోదా చేయగా.. అతని షూలో కెమెరా లభ్యమైంది.

మాల్ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు నిందిత వ్యక్తిని తీసుకున్నారు. కాగా, నిందితుడు హర్యానా వినియోగదారుల వేదిక మాజీ అధ్యక్షుని కుమారుడిగా గుర్తించారు.

నిందితుడి వద్ద నుంచి మొత్తం 12 అసభ్యకర చిత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆన్‌లైన్‌లో కెమెరాను కొన్నట్లు ఆ వ్యక్తి పోలీసుల విచారణలో తెలిపాడు.

నిందితుడు తీసిన ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి బెదిరింపులకు పాల్పడేందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+