Electric Scooty: దొంగలు ఎత్తుకెళ్లిన స్కూటీ.. ఎలా దొరికిందంటే..!
సాధారణంగా మనం ద్విచక్రవాహనాలను ఎక్కడన్న పార్క్ చేస్తే హ్యాండిల్ లాక్ వేస్తాం. ఎందుకంటే మన వాహనాన్ని ఎవరు దొంగలించకూడదని. ఒక్కొసారి హ్యాండిల్ లాక్ వేసినా వాహనాలు పోతుంటాయి. ఇలానే ఓ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పోయింది. స్కూటర్ యజమాని వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. కానీ వారు కూడా కనిపెట్ట లేకపోయారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటీలో ఉన్న అధునాతన ఫీచర్స్ తెలుసుకున్న బాధితురాలు మళ్లీ పోలీసులు వద్దకు వెళ్లారు. ఇలా కంపెనీ, పోలీసుల సహకారంతో పోయిన స్కూటీని తిరిగి దక్కించుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.
జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన అంజలి పాల్ అనే మహిళ కొద్ది రోజుల క్రితం ఓలా స్కూటర్‌ను కొనుగోలు చేశారు. అయితే ఆమె స్కూటీని ఎవరు ఎత్తుకెళ్లారు. అంతేకాదు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సహాయంతో వేరే నగరానికి పంపడానికి స్కూటీని పూర్తిగా ప్యాక్ చేశారు. అయితే అంజలి తన ఎలక్ట్రిక్ స్కూటర్ లోని జిపిఎస్ నావిగేషన్ ద్వారా పోలీసుల సహకారంతో స్కూటీ ఎక్కడుందో కనిపెట్టగలిగింది. స్కూటీ ఎక్కడుందో కనిపెట్టడానికి ఓనర్ లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ ఉపయోగిస్తారట.

అంజలి తన స్కూటీ ఎక్కుడుందో తెలుసుకోవడానికి కంపెనీ కూడా సహాయం చేసినట్లు సమాచారం. స్కూటీని జోధ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో పట్టుకున్నారు. వాహనాల్లో అధునాతన సౌకర్యాలు, ఫీచర్స్ ఉండడం వినియోగదారుడికి మంచిదని చెబుతున్నారు. సాధారణంగా దొంగల భారీ నుంచి రక్షించుకోవడానికి కార్లలో, బైకులలో యాంటీ తెఫ్ట్ అలారం వంటివి ఉంటాయి. తాజాగా జీపీఎస్ కూడా ఉండడం మరింత భద్రత కల్పిస్తుంది.
I GOT MY OLA SCOOTER BACK🥰 special thanks to @OlaElectric @ola_supports @bhash they provided us the ola location several times.
— Anjali Pal (@anjalipal8477) April 13, 2023
And special thanks to the sub inspector @SulochanaJaat and rajendra sir posted in basani police station jodhpur @CP_Jodhpur @JdprRuralPolice https://t.co/qxH3AERtk1 pic.twitter.com/DnfYeylXLD
గతంలో కూడా జిపిఎస్ లొకేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా అనేక హై ఎండ్ కార్లు రికవరీ చేశారు. ఓలానే కాదు ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ స్కూటీల్లో అనేక ఫీచర్స్ అందిస్తున్నారు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications