ఫేస్ బుక్‌లో గాలం.. మాటలతో మాయ.. పార్కింగ్ ఏరియాలో 'రేప్'

అతని మాటల్లో మర్మం కనిపెట్టని యువతి.. అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్ లో ఇద్దరు కలుసుకున్నారు.

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ లో కొత్త పరిచయాలు మంచి కన్నా చెడుకే ఎక్కువ దారి తీస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం బయటపడుతున్నాయి. ఆర్థిక అవసరాల కోసం.. శారీరక అవసరాల కోసం.. అమాయక యువతీ యువకులకు వల వేసే కేటుగాళ్లకు ఫేస్ బుక్ లో కొదువలేదు. వారి వలలో చిక్కుకున్నారంటే బాధితులుగా మిగిలిపోవాల్సిందే.

తాజాగా న్యూఢిల్లీకి చెందిన ఓ యువతి కూడా ఫేస్ బుక్ ద్వారా పరిచమైన సోనూ అనే ఓ వ్యక్తి చేతిలో మోసపోయింది. ఫేస్ బుక్ లో ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇదే క్రమంలో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ సోనూ మాయ మాటలు చెప్పాడు.

Woman, 24, Allegedly Raped In Car At Parking Of South Delhi Mall

అతని మాటల్లో మర్మం కనిపెట్టని యువతి.. అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్ లో ఇద్దరు కలుసుకున్నారు. ఆపై ఆమెను పార్కింగ్ ప్రాంతం వైపు తీసుకెళ్లిన సోనూ.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరిన్ని ఆధారాల కోసం సీసీటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+