మతం మారాలని డిమాండ్‌తో భార్య నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్

చంఢీఘడ్: బలవంతంగా మతం మారాలని డిమాండ్ చేస్తూ ఆమె నగ్నఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ భర్త ఉదంతమిది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని పంచకులలో చోటు చేసుకొంది.ఈ మేరకు బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

ఓ మతానికి చెందిన యువతి వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకొంది. కొన్ని రోజుల తర్వాత మతం మారాలని యువతికి వేధింపులు పెరిగాయి. అయితే మతం మారడానికి ఆ యువతి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆమె భర్త ఆమెను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాడు.

Woman accuses husband of forceful religious conversion in Haryana

భార్య నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడికొ సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అసలు నిందితుడికి సహకరించి ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మతం మారనందుకు తనకు తన భర్త విడాకులు ఇస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+