వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: 4 ఏళ్ళ బాలికపై 60 ఏళ్ళ ఆయా లైంగిక దాడి, అరెస్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: నాలుగేళ్ళ చిన్నారిపై స్కూల్‌లో పనిచేసే 60 ఏళ్ళ ఆయా లైంగికదాడికి పాల్పడింది. దీంతో ఆ బాలిక ప్రైవేట్‌ పార్ట్స్ వద్ద గాయాలయ్యాయి. బాలికపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు గుర్తించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయాను అరెస్ట్ చేశారు.

దేశ వ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలను అనేకం ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ముంబైలోని ఓ స్కూల్లో 60 ఏళ్ళ వయస్సున్న ఆయా 4 ఏళ్ళ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడింది.

Woman caretaker at Mumbai school sexually assaults 4-year-old, held

స్కూల్‌కు వెళ్ళేందుకు ఆ చిన్నారి భయపడుతోంది. అయితే స్కూల్ కు ఎందుకు వెళ్ళవని ఆ బాలికను కుటుంబసభ్యులు ప్రశ్నించారు. అయితే ఆ చిన్నారి అసలు విషయాన్ని చెప్పింది. దీంతో చిన్నారిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

వైద్యులు బాధితురాలిని పరీక్షించారు. చిన్నారి ప్రైవేట్‌పార్ట్స్ వద్ద గాయాలున్నట్టుగా గుర్తించారు. పాప తల్లిదండ్రులు పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలికి ఫోను చేసి విషయం చెప్పారు.

అయితే ఏప్రిల్ 23వ తేదిన యధావిధిగా ఆయా స్కూల్‌లో విధులకు హజరైంది. అయితే పోలీసులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి ఆయాను అరెస్ట్ చేశారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఆయా పోలీసుల విచారణలో ఒప్పుకొంది.నిందితురాలిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
The Byculla police have arrested a 60-year-old woman caretaker for sexually assaulting a four-year-old girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X