పుట్టింటివాళ్లే!..: ఆమెను నగ్నంగా మార్చి.. 20ఏళ్లు చీకటి గదిలో?

చీకటి గదికి ఉన్న కిటీకి నుంచి మహిళ అత్యంత ధీనస్థితిలో ఉండటం అతను గమనించాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించడంతో.. ఈ ఉదంతం వెలుగుచూసింది.

పనాజీ: వివాహం ఆమె జీవితాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కట్టుకున్నవాడు మోసం చేశాడని పుట్టింటికి వస్తే.. ఆదరించాల్సినవాళ్లు కాస్త అత్యంత కర్కషంగా వ్యవహరించారు. ఏకంగా 20ఏళ్ల పాటు ఆమెను చీకటి గదికే పరిమితం చేసి.. యువతి జీవితాన్ని నరకకూపంగా మార్చేశారు.ఉత్తరగోవాలో ఇటీవలే ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర గోవాలోని క్యాండోలిమ్ కు చెందిన మహిళ 20ఏళ్ల క్రితం ముంబైకి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహానంతరం భర్తతో పాటు ముంబైలోని అత్తింటికి వెళ్లింది. కానీ అక్కడికెళ్లాక గానీ ఆమెకు అసలు విషయం తెలియలేదు. అప్పటికే భర్తకు మరో యువతితో పెళ్లయిందని తెలుసుకుని, తాను మోసపోయానని గ్రహించింది.

పుట్టింటికి వచ్చి:

పుట్టింటికి వచ్చి:

తిరిగి పుట్టింటికి వచ్చి తన గోడు వెల్లబోసుకుంది. కానీ పుట్టింటివాళ్లు మాత్రం.. ఆమె పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించారు. దు:ఖంలో ఉన్న ఆమెను ఓదార్చి అండగా నిలబడాల్సిందిపోయి.. ఆమెను నగ్నంగా మార్చి చీకటి గదిలోకి తీసేశారు.

20ఏళ్లుగా అరణ్య రోదనే:

20ఏళ్లుగా అరణ్య రోదనే:

20ఏళ్లుగా ఆమె వేదన అరణ్యరోదన గానే మిగిలిపోయింది. నరక కూపం లాంటి చీకటిగదిలో ఒకరకంగా విగతజీవి లాగే బతికింది.ఇలాంటి తరుణంలో..ఆమెను నిర్బంధించిన వ్యవహారం ఓ పోలీస్ కానిస్టేబుల్ కనిపెట్టడం.. ఆ మహిళ జీవితానికి స్వేచ్చను ప్రసాదించినట్లయింది.

ఇలా వెలుగులోకి?:

ఇలా వెలుగులోకి?:

చీకటి గదికి ఉన్న కిటీకి నుంచి మహిళ అత్యంత ధీనస్థితిలో ఉండటం అతను గమనించాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించడంతో.. ఈ ఉదంతం వెలుగుచూసింది. చీకటి గదిని తెరిచిన పోలీసులు.. దాదాపు యాభై ఏళ్లు వయసు ఉన్న మహిళ నగ్నంగా ధీనాతి ధీన స్థితిలో ఉండటం గమనించారు.

కుటుంబ సభ్యుల వాదన:

కుటుంబ సభ్యుల వాదన:

అనంతరం చికిత్సం నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం.. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే గదిలో బంధించామని చెప్పడం గమనార్హం. ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+