రేప్ కేసు పెడతా: మహిళని 12 ముక్కలు నరికాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో దారుణం జరిగింది. అత్యాచారం కేసు పెడతానని ఓ మహిళ బెదిరించడంతో, 48 ఏళ్ల వ్యక్తి ఆమెను ఏకంగా 12 ముక్కలుగా నరికేశాడు. ఆమె మృతదేహం భాగాలు జూలై 24వ తేదీన రైల్వే ట్రాక్ పక్కన కనిపించాయి.

నిందితుడిని కోషోర్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను రైల్వే ఉద్యోగి. అతనిని పోలీసులు మంగళవారం నాడు కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు అతనిని సోమవారం నాడు రాత్రి అరెస్టు చేశారు.

నిందితుడు సదరు మహిళ చేతులను, కాళ్లను, తలను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అనంతరం ఓ సైకిల్ పైన వాటిని తీసుకు వెళ్లి షాదోల్ - అనుప్పర్ రైల్వే లైన్ మధ్యలో పడేశాడు. ఇది అతని ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉంది.

Woman cries rape, man chops her into twelve pieces

ఈ హత్య గురించి ఎలాంటి విషయం తెలియదని, కానీ నిందితుడి ఇంటి వద్ద రక్తం, పగిలిన గాజులు కనిపించాయని, దీంతో హత్య విషయం బయటపడిందని పోలీసులు చెప్పారు.

అతనిని అరెస్టు చేసి, విచారణ జరిపామని పోలీసులు చెప్పారు. విచారణలో అతను తన తప్పును అంగీకరించాడని చెప్పారు.

నిందితుడు కిషోర్ యాదవ్, హత్య గావించబడిన మహిళ మధ్య వివాహేతర సంబంధం ఉందా లేదా తెలియాల్సి ఉందన్నారు. యాదవ్ ప్రస్తుతం ఒక్కడే తన ఇంటిలో నివసిస్తున్నాడని, అలాగే మృతురాలు వితంతువు అని చెప్పారు.

శనివారం రాత్రి ఆమె కిషోర్ యాదవ్ ఇంటికి వచ్చి అత్యాచారం కేసు పెడతానని బెదిరించిందని, కోపోద్రిక్తుడైన అతను ఆమెను తొలుత గొడ్డలితో చంపేశాడని చెప్పారు. ఆ తర్వాత ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేశాడని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 48-year-old man chopped the body of a woman into more than 12 pieces after she threatened to lodge a rape complaint with police in Shahdol district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X