భర్త ఊహించలేదు: ఆ ఫన్నీ కామెంట్స్‌ను భార్య ఎంత సీరియస్‌గా తీసుకుందంటే?
ఇండోర్: భర్త సరదాగా చేసిన కామెంట్స్‌ను ఓ భార్య సీరియస్‌గా తీసుకుంది. విషం తాగి ఏకంగా ప్రాణాలు తీసుకోవడంతో సదరు భర్త నిర్ఘాంతపోయాడు. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్ కు చెందిన స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నలిన్ పాట్నీ పట్టణంలో ఒక క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అతని భార్య దంత సమస్యతో బాధపడుతోంది. దీంతో చికిత్స కోసం భార్య సోనాను తనకు తెలిసిన డెంటిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు.
ఒక దంతం పాడైపోవడంతో దాన్ని తొలగించి కొత్త పన్ను అమర్చాల్సి ఉంటుందని డెంటిస్ట్ తెలిపాడు. తర్వాత చికిత్స చేయించుకుంటామని చెప్పి ఆ దంపతులు ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక భర్త నలిన్ భార్య సోనాను ఆటపట్టించాడు.
పన్ను తొలగించాక నీ ఫోటో వాట్సాప్ లో పెడుతానని, దాని కింద నా భార్య అప్పుడే ముసలిదైపోయిందని క్యాప్షన్ కూడా పెడుతానని సరదాగా కామెంట్ చేశాడు. అంతే, అక్కడినుంచి బెడ్రూమ్ లోకి వెళ్లిపోయిన భార్య బయటకి వచ్చి తాను విషం తాగానని చెప్పింది. షాక్ తిన్న నలిన్ ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications