వివాహేతర బంధం: ఖర్చులకు డబ్బివ్వలేదని ప్రియుడ్ని దారుణంగా చంపేసిన యువతి
నోయిడా: వివాహితుడైన వ్యక్తిని ప్రేమించడమేగాక, ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని అతడ్ని దారుణంగా హత్య చేసిన యువతిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ దారుణ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధానికి దారితీసిన పరిచయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు సోనమ్ అలియాస్ సోను(23), బాధితుడు జితేంద్ర(37)లు ధన్‌కౌర్‌లోని లోడిపుర గ్రామానికి చెందిన వారు. వివాహితుడైన జితేంద్రకు కొన్ని నెలల క్రితం సోనమ్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వివాహేతర సంబంధాన్ని కూడా కొనసాగించారు.

డబ్బులివ్వనని చెప్పడంతో యువతి బెదిరింపులు
ఈ క్రమంలో ఇటీవల వారిమధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటినుంచీ తనకు డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అతని భార్యకు పంపిస్తానంటూ సోనమ్.. జితేంద్రను బెదిరింపులకు గురిచేసింది. అయితే, తాను డబ్బులివ్వనని చెప్పడంతో అతనిపై సోనమ్ కోపం పెంచుకుంది.

దారుణంగా చంపేసింది
జితేంద్రను హత్య చేయాలని కుట్ర పన్నిన సోనమ్.. బిలాస్‌పూర్ ప్రాంతానికి రావాలని అతనికి ఫోన్ చేసి కోరింది. జితేంద్ర తన వద్దకు రాగానే మంచంకోళ్లతో అతని తలపై పలుమార్లు బాదింది సోనమ్. దీంతో జితేంద్ర కుప్పకూలిపోయాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. సోనమ్ అక్కడ్నుంచి పరారైంది.

సోదరుడి ఫిర్యాదుతో..
ఈ నేపథ్యంలో జితేంద్రను ఎవరో చంపారని, తమకు సోనమ్‌పై అనుమానం ఉందని జితేంద్ర సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు సోనమ్‌ను అరెస్ట్ చేశారు. జితేంద్రను హత్య చేసేందుకు ఉపయోగించిన మంచం కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications