కుమార్తె మీద కన్ను వేసిన ప్రియుడు, జాతరకు భర్త, రాత్రి జల్సా, పక్కాప్లాన్ తో చంపేసింది!

బెంగళూరు: తనతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన కుమార్తె మీద కన్ను వేసి లైంగికంగా, మానసికంగా హింసిస్తున్న ప్రియుడిని భర్త జాతరకు వెళ్లిన సమయంలో ఓ మహిళ పక్కాప్లాన్ తో ఇంటికి పిలిపించి అతిదారుణంగా చంపేసిన ఘటన బెంగళూరు నగరంలోని పిణ్యా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దంపతులు కుమార్తె

దంపతులు కుమార్తె

బెంగళూరు నగరంలోని పిణ్యా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిక్కబిదరకల్లు ప్రాంతంలోని అన్నపూర్ణేశ్వరి లేఔట్ 11వ క్రాస్ లో ప్రభు అనే వ్యక్తి భార్య రూపా (32), కుమార్తె (14) కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రభు భార్య రూపా గార్మెంట్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.

భర్త స్నేహితుడితో రోమాన్స్

భర్త స్నేహితుడితో రోమాన్స్

రూపా భర్త ప్రభుకు రఘు (29) అనే స్నేహితుడు ఉన్నాడు. రఘు అప్పుడప్పుడు స్నేహితుడు ప్రభు ఇంటికి వెళ్లి వస్తూ అతని భార్య రూపాను వలలో వేసుకున్నాడు. భర్త లేని సమయంలో రూపా ప్రియుడు రఘును ఇంటికి పిలిపించుకుని రోమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది.

కుమార్తె మీద కన్ను

కుమార్తె మీద కన్ను

ప్రియురాలు రూపాతో జల్సా చేస్తున్న రఘు నిత్యం మధ్యం మత్తులో నీ కూతురితో ఓ రాత్రి గడుపుతానని, అంగీకరించాలని చెప్పేవాడు. ఆ సమయంలో రూపా తీవ్రస్థాయిలో రఘుకు అభ్యంతరం చెబుతూ వచ్చేది. నీవే ఇంత శారీరక సుఖం ఇస్తున్నావంటే నీ కుమార్తె ఇంక ఎంత సుఖం ఇస్తుందో అంటూ రఘు చాల అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

సమయం కోసం చూసింది

సమయం కోసం చూసింది

తన కుమార్తెను అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను లైంగిక వేధింపులకు గురి చెయ్యడానికి ప్రయత్నిస్తున్న ప్రియుడు రఘును రూపా చాలసార్లు అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అయితే రఘు పద్దతి మాత్రం మారలేదు. తన కుమార్తెను రఘు విడిచిపెట్టడని నిర్ణయించిన రూపా ఎలాగైనా అతన్ని అంతం చెయ్యాలని సమయం కోసం వేచిచూసింది.

జాతరకు భర్త

జాతరకు భర్త

రెండు రోజుల క్రితం తుమకూరు జిల్లాలోని తిపటూరులో జరుగుతున్న జాతరకు ప్రభు వెళ్లాడు. ప్రభు భార్య రూపా ప్రియుడు రఘుకు ఫోన్ చేసి తన భర్త ఊరికి వెళ్లాడని, ఇంటికి రావాలని చెప్పింది. బుధవారం రాత్రి రఘు ప్రియురాలు రూపా ఇంటికి మద్యం సేవించి వెళ్లి జల్సా చేశాడు.

అనుమానం రాకుండా

అనుమానం రాకుండా

ప్రియుడు రఘుకు అనుమానం రాకుండా శారీరక సుఖం ఇచ్చిన రూపా తరువాత నిద్రమాత్రలు కలిపిన భోజనం అతనికి పెట్టింది. మద్యం మత్తు, నిద్రమాత్రల మత్తుతో రఘు స్పుహ కోల్పోయాడు. ఆ సమయంలో చేతికి గ్లోజ్ లు వేసుకున్న రూపా కత్తి తీసుకుని అతనిని దారుణంగా పోడిచింది. కసి తీరక పోవడంతో ఇంటిలో ఉన్న రుబ్బురాయి తీసుకుని రఘు తల మీద వెయ్యడంతో అతను అక్కడే చనిపోయాడు.

పోలీసులకు ఫోన్

పోలీసులకు ఫోన్

ప్రియుడు రఘును హత్య చేసిన రూపా చేతి గ్లోజులు తీసుకెళ్లి సమీపంలోని డ్రైనేజ్ పక్కన విసిరేసింది. తరువాత రూపా భయంతో పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రూపాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని, రఘు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని గురువారం బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+