భర్త మృతి, మరో యువకుడితో లవ్ ఎఫైర్, ట్విస్టిచ్చిన లవర్

చెన్నై: పెళ్ళైంది ఇద్దరు పిల్లలు, విధి వక్రీకరించి మూడేళ్ళ క్రితం భర్త అనారోగ్యంతో మరణించాడు. భర్త మరణించిన తర్వాత మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఆ యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో పిల్లలకు విషమిచ్చి తాను కూడ ఆత్మహత్య చేసుకొన్న ఘటన చెన్నైలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు చెందిన రవీంద్రన్, శ్రీజను వివాహం చేసుకొన్నాడు. రవీంద్రన్ కారు మెకానిక్‌గా పనిచేసేవాడు. శ్రీజ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేసేది.

రవీంద్రన్, శ్రీజ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. ప్రణీత్ కు ఆరేళ్ళు, సతీష్‌కు నాలుగేళ్ళు. అయితే కారు మెకానిక్‌గా పనిచేస్తున్న రవీంద్రన్ అనారోగ్యంతో మూడేళ్ళ క్రితం మృతి చేశాడు.దీంతో శ్రీజ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి.

భర్త మరణించాక మరో వ్యక్తితో ప్రేమలో పడిన శ్రీజ

భర్త మరణించాక మరో వ్యక్తితో ప్రేమలో పడిన శ్రీజ

భర్త మరణించిన తర్వాత శ్రీజ తాను పనిచేసే ఆసుపత్రిలో పనిచేసే యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరు కొంత కాలం సహజీవనం చేశారని స్థానికులు అంటున్నారు. అయితే కొంత కాలంగా ఆ యువకుడు శ్రీజను దూరం పెట్టాడు.

మరో యువతితో వివాహం నిశ్చయం

మరో యువతితో వివాహం నిశ్చయం

శ్రీజతో పరిచయం పెంచుకొన్న యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైంది దీంతో ఆ యువకుడు శ్రీజను దూరం పెట్టాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో శ్రీజ తీవ్ర మనోవేదనకు గురైందని విచారణలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు.దీంతో శ్రీజకు ఆ యువకుడు బ్రేకప్ చెప్పాడు

పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొన్న శ్రీజ

పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొన్న శ్రీజ

ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో శ్రీజ నిరాశా నిస్పృహలకు గురైంది. దీంతో శ్రీజ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొంది. పిల్లలకు విషమిచ్చి తాను కూడ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు కూడ చనిపోయారు. తాను ఒక్కతే చనిపోతే పిల్లలు అనాధలుగా మారుతారని భావించిన శ్రీజ పిల్లలకు కూడ విషమిచ్చింది.

టీ కోసం వస్తే శవాలుగా కన్పించారు.

టీ కోసం వస్తే శవాలుగా కన్పించారు.

శ్రీజను పొరుగున ఉండే ఓ మహిళ టీ కోసం రమ్మని ఆహ్వనించింది. అయితే శ్రీజ ఎంతకీ రాకపోవడంతో పొరుగున ఉండే మహిళే శ్రీజను తన ఇంటికి పిలిచేందుకు వచ్చింది. ఆ సమయంలో శ్రీజతో పాటు ఇద్దరు శవాలుగా పడి ఉన్నారు. ఆమె పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+