అందరూ చూస్తుండగానే లోకల్‌ట్రైన్ మహిళకు వేధింపులు, హత్యాయత్నం: వీడియో తీశారు

Recommended Video

    లోకల్ ట్రైన్ లో మహిళ పై ,హత్యాయత్నం...!

    ముంబై: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగుచూసింది. లోకల్ ట్రైన్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మహిళను వేధించడంతోపాటు హత్య చేసేందుకు ప్రయత్నించాడు. గార్డు కంపార్ట్‌మెంట్‌లోని గిల్స్‌కు అవతలి వైపు ఉండటంతో ఏమీ చేయలేకపోయాడు.

    పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడ్ని తదుపరి వచ్చే స్టేషన్లో అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. గురువారం రాత్రి థానే ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.

    Woman molested in Mumbais local train, accused arrested

    ఆ వీడియోలో లైంగిక వేధిస్తున్న ఆ వ్యక్తిని మహిళ తీవ్రంగా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఓ దశలో డోర్ వద్దకు కూడా వెళ్లింది. రైల్లోని తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని తదుపరి స్టేషన్లో అరెస్ట్ చేశారు.

    నిందితుడిని రఫిక్ షేక్‌గా గుర్తించారు. అతనిపై హత్యాయత్నం, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. అతడు సదరు మహిళకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి ఉండగా.. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని శుక్రవారం రైల్వే కోర్టు ముందు హాజరుపర్చుతున్నట్లు తెలిపారు.

    ఈ క్రమంలోనే ఆమెను లైంగిక వేధించిన నిందితుడు.. ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. బాధిత మహిళను నిందితు తీవ్రంగా కొట్టాడని, అడ్డుకునేందుకు యత్నిస్తే తనను కూడా చంపుతాడేమోనని ముందుకెళ్లలేదని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. అయితే, తాను గార్డును ఎమర్జెన్సీ అలారం ఇవ్వమని అడిగానని, కానీ, అతడు పట్టించుకోలేదని చెప్పాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+