లిఫ్ట్ ఇచ్చి మహిళపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

మైహార్ బస్ స్టాండులో 24 ఏళ్ల మహిళ బస్సు కోసం నిరీక్షిస్తుండగా, మల్టీ యుటిలిటీ వాహనంలో నలుగురు వ్యక్తులు వచ్చి వాహనాన్ని ఆపి ఆమె చెంతకు వెళ్లారు. తాము కూడా సాత్నాకు వెళ్తున్నామని, తమ వాహనంలో సాత్నాకు తీసుకుని వెళ్తామని మహిళకు వారు చెప్పారు.
అయితే, వారు వాహనాన్ని కాట్నీ వైపు నడిపించారు. కారు నడుస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. కారును కుసేడీ గ్రామం వద్ద ఆపి నిర్మానుష్యమైన ప్రదేశంలోకి ఆమెను తీసుకుని మరోసారి రేప్ చేశారు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దాంతో ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు.
స్పృహ వచ్చిన తర్వాత మహిళ సాత్నా - కాట్నీ రోడ్డుపై గల ఓ డాబాకు వచ్చి విషయాన్ని ఆ డాబా యజమానికి చెప్పింది. డాబా యజమాని మైహార్ పోలీసులను పిలిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications