Viral Video: శ్మశానంలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ..
సాధారణంగా ఇళ్లు, ఆఫీస్ లు, ఇతర ప్రదేశాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడుతుంటారు. కానీ శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టడం ఎప్పుడైనా విన్నారా..? ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్మశానంలో ఫుడ్ ఆర్డర్ ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఓ మహిళ శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. డెలివరీ బాయ్ కు మహిళ శ్మశానంలో ఉన్నట్లు అర్థం అవుతుంది. అప్పుడు డెలివరీ బాయ్ మహిళతో.. నేను లొకేషన్ కు వచ్చాను మేడం అని చెబుతాడు. దానికి ఆ మహిళ అలా స్ట్రయిట్ గా రండి.. అక్కడ ఓ కుక్క ఉంటుంది.. అని చెప్పగా.. అప్పుడు డెలివరీ బాయ్ అది శ్మశాన వాటిక మేడం అని చెబుతాడు. దీనికి ఆ మహిళ స్పందిస్తూ.. కుక్కను చూశారు కదా.. శ్మశాన వాటిక గేటులోపలికి రండి అని పేర్కొంటుంది.
అప్పుడు డెలివరీ బాయ్ తేరుకుని మీరు శ్మశాన వాటిక నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టారా..? అని అడుగుతూ గేట్ బయటకు వచ్చి ఆర్డర్ తీసుకోవాలని అంటాడు. అయితే అప్పుడు మహిళ స్పందిస్తూ భయపడకు.. నేను ఇక్కడే ఉన్నాను.. దెయ్యాలంటే భయమా..? అని అడుగుతుంది. దీనికి డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకోకుంటే క్యాన్సిల్ చేస్తానని చెబుతాడు. అయితే ఇది డెలివరీ బాయ్ ను భయపెట్టేందుకు చేసిన ఫ్రాంక్ వీడియోనా..? లేక ఆ మహిళ తన ఫ్రెండ్స్ తో నిజంగానే శ్మశానంలో ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదా వ్యూస్ కోసం ఇలా చేశారా..? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications