హనుమాన్ విగ్రహం ముందు లేడీ బాడీబిల్డర్ల పోటీలు: కాంగ్రెస్ నేతల ఆగ్రహం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాంలో హనుమాన్ విగ్రహం ముందు లేడీ బాడీ బిల్డర్ల పోటీలు నిర్వహించడంపై వివాదం రాజుకుంది.
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాంలో హనుమాన్ విగ్రహం ముందు లేడీ బాడీ బిల్డర్ల పోటీలు నిర్వహించడంపై వివాదం రాజుకుంది. బీజేపీ నేత, రత్లాం మేయర్ ప్రహ్లాద్ పటేల్ నేతృత్వంలో ఈ పోటీని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే, బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.
హనుమాన్ కటౌట్ ముందే మహిళలతో బికినీ డ్రెస్సులతో బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించి హిందూ ధర్మాన్ని అవమానించారని బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోటీలను నిర్వహించిన మేయర్, బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

భోపాల్‌తో సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. పోటీలు జరిగిన వేదికను కాంగ్రెస్ నేతలు జలంతో శుద్ధి చేశారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పిలుపు మేరకు ఘటనా స్థలి వద్ద హనుమాన్ చాలీసాను పఠించారు.
रतलाम महापौर के मुख्य आतिथ्य में भगवान हनुमान जी की मूर्ति रखकर अश्लील प्रदर्शन वह भी मुख्यमंत्री जी के जन्मदिन के मौके पर।सनातन संस्कृति को बेचखाने वाले इस नेता पर क्या कार्यवाही होगी शिवराज जी? @BJP4India @OfficeOfKNath @digvijaya_28 @inc_jpagarwal pic.twitter.com/Xebc6dLKOW
— Bhupendra Gupta Agam (@BhupendraAgam) March 5, 2023
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బర్త్ డే వేడుకల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుచేటని, దీనికి సీఎం క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications