దిగ్భ్రాంతికి గురిచేసేలా: మహిళలపై కాంగ్రెస్ నేత వివాదస్పద కామెంట్స్!

Subscribe to Oneindia Telugu

త్రివేండ్రం: కేరళ కాంగ్రెస్‌కు తాత్కాళిక పీసీసీ చీఫ్‌గా నియమితులైన ఎంఎం హసన్.. పదవి చేపట్టిన వెంటనే మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు పట్టుబట్టి మరీ ఆ పదవి ఇప్పించుకున్న మాజీ సీఎం ఉమెన్ చాందీని సైతం తప్పుపట్టే పరిస్థితి తలెత్తింది.

మహిళల రుతుస్రావం అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంఎం హసన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఆధ్యాత్మిక ఆలయ ప్రదేశాల్లోకి వారిని అనుమతించకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు.

Women Can't Enter Any Place of Worship While Menstruating: Kerala Congress Chief

మహిళలను రుతుస్రావం సమయంలో ఆలయాల్లోకి రానివ్వకూడదని, దీని వెనుక ఓ సైంటిఫిక్ కారణం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదని, రుతుస్రావం సమయంలో మహిళలు ఉపవాసం కూడా ఉండరాదని చెప్పారు. శరీరం మలినంగా ఉన్నప్పుడు, చర్చిలు, మసీదులు, ఆలయాలకు వారు వెళ్లకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు. ఎంఎం హసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేవిగా మారాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kerala Pradesh Congress Committee acting president M M Hassan said that women are impure during menstruation and they should not enter any place of worship during that time.
Please Wait while comments are loading...