ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పులు-మహిళకు తీవ్ర గాయాలు- లాయర్ ముసుగులో వచ్చిన షూటర్..
ఢిల్లీలో ఇవాళ దారుణం చోటు చేసుకుంది. ఏకంగా కోర్టు కాంప్లెక్స్ లోనే కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ షూటవుట్ లో పాల్గొన్న షూటర్.. లాయర్ ముసుగులో వచ్చి కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఢిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టులో ఇవాళ లాయర్ వేషంలో వచ్చిన షూటర్ అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. కోర్టు ఆవరణలో అతను నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ కాల్పులు జరిపిన నిందితుడు హిస్టరీ-షీటర్ అని తెలుస్తోంది. గతంలో అతను పలు కాల్పులకు పాల్పడిన చరిత్ర ఉందని తెలుస్తోంది.

ఢిల్లీలో పట్టపగలే కోర్టులో కాల్పులు జరిగిన ఘటనతో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పటిష్ట పోలీసు భద్రత ఉన్నప్పటికీ లాయర్ ముసుగులో వచ్చిన ఓ షూటర్ కాల్పులకు తెగబడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాకేత్ కోర్టు వద్ద భద్రత కూడా పెంచారు. కాల్పుల తర్వాత పరారీ అయిన షూటర్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Delhi: A woman has been injured in an incident of firing at Saket court. Four rounds were fired. Police on the spot.
— ANI (@ANI) April 21, 2023
(Warning: Disturbing visuals)
Visuals confirmed by police. pic.twitter.com/vdaUBqZxmp
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications