చారిత్రక ఘట్టం: 30 ఏళ్ల నిరీక్షణకు తెర, రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)కు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఎగువసభలోనూ సుదీర్ఘంగా చర్చించారు.
నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చారిత్రక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దాదాపు 10 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఆటోమేటిక్ ఓటు రికార్డింగ్ వ్యవస్థ ద్వారా ఓటింగ్ చేపట్టారు. ప్రతి సభ్యుడి వద్ద ఉన్న మల్టీ మీడియా డివైజ్ సాయంతో ఓటింగ్ జరిపారు.

ఈ బిల్లుకు మద్దతుగా 215 మంది సభ్యులు ఓటు వేశారు. ఎవరూ వ్యతిరేకించలేదు. దీంతో చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీంతో ఉభయసభ(parliament)ల్లోనూ ఆమోదం పొందినట్లయింది. దాదాపు మూడు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడినట్లయింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించడంతో ఇక చట్టంగా మారడం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిసభ్యుడికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ బిల్లుపై రాజ్యసభలో చేపట్టిన చర్చలో ఉభయ సభల నుంచి వివిధ పార్టీలకు చెందిన 132 మంది సభ్యులు భాగస్వాములయ్యారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ చర్చలోని ప్రతి పదం రాబోయే ప్రయాణంలో మనందరికీ ఉపయోగపడుతుందని.. ప్రతి విషయానికి దాని సొంత ప్రాముఖ్యత, విలువ ఉంటాయని తెలిపారు.
A defining moment in our nation's democratic journey! Congratulations to 140 crore Indians.
— Narendra Modi (@narendramodi) September 21, 2023
I thank all the Rajya Sabha MPs who voted for the Nari Shakti Vandan Adhiniyam. Such unanimous support is indeed gladdening.
With the passage of the Nari Shakti Vandan Adhiniyam in…
ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ ప్రధాని మోడీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మన దేశ ప్రజాస్వామిక ప్రయాణంలో నిర్ణయాత్మక ఘట్టం! 140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications